Begin typing your search above and press return to search.
ప్రపంచంలో మరే కంపెనీకి లేని ఘనత ఆపిల్ ది!
By: Tupaki Desk | 3 Aug 2018 4:59 AMఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టెక్నాలజీ దిగ్గజం యాపిల్. తన ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్ని దోచుకున్న యాపిల్.. ప్రపంచంలో మరే కంపెనీ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది.
యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా?. అంకెల్లో చెప్పే కంటే.. ఒక చిన్న ఉదాహరణతో దాని సత్తాను చెప్పేయొచ్చు. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సరిసమానం యాపిల్ కంపెనీ. అర్జెంటీనా.. నెదర్లాండ్స్.. స్వీడన్ లాంటి 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం ఇప్పుడా కంపెనీ. యాపిల్ ఆర్థిక బలాన్ని మన రూపాయిల్లో చెప్పుకుంటే.. అక్షరాల రూ.69లక్షల కోట్లతో సమానం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే కంపెనీ ఒకప్పుడు దివాలా కోరల్లో చిక్కుకుంది. అలాంటి కంపెనీ ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా రికార్డును సృష్టించింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ ప్రయాణాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చేసింది.
యాపిల్ చరిత్రలోకి వెళితే 1976లో ఒక గ్యారేజ్ లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని షురూ చేశారు. మిగిలిన భాగస్వాములతో వచ్చిన విభేదాల కారణంగా 1985లో స్టీవ్ కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 1997లో యాపిల్ దాదాపుగా దివాలా స్థితికి చేరుకుంది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్లో బిల్ గేట్స్ కు చెందిన మైక్రోసాఫ్ట్.. ఇతర కంపెనీల ధాటికి నిలబడలేకపోయింది. అదే సమయంలో తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో మూడోవంతును ఇంటికి పంపించేసింది.
ఆ టైంలో యాపిల్ విషమ పరీక్షను ఎదుర్కొంది. మూడు నెలల వ్యవధిలో ఆ కంపెనీ కానీ కోలుకోకుంటే దివాలాకు దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో స్టీవ్ మళ్లీ యాపిల్ లో జాయిన్ అయ్యాడు. 1998లో కలర్ ఫుల్ ఆల్ ఇన్ వన్ డెస్క్ టాప్ కంప్యూటర్ ఐమ్యాక్ జీ3ని మార్కెట్లోకి తెచ్చారు. అది కాస్తా సూపర్ హిట్ అయ్యింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2001లో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్ ను మార్కెట్లోకి తెచ్చారు.
దీని ఎంట్రీతో మ్యూజిక్ డివైజ్ ల స్వరూపాన్నే మార్చేసింది. ఆ తర్వాత కంపెనీ తీసుకొచ్చిన ఐఫోన్ తో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ప్రతి మూడు నెలలకు నాలుగు లక్షలకు పైగా ఐఫోన్లను అమ్ముతోంది. యాపిల్ విజయం ఇలా సాగుతుంటే.. ఈ కంపెనీని నమ్ముకున్న ఏ ఒక్కరూ చెడిపోలేదు. ఊహించని రీతిలో బాగుపడ్డారు. 2003లో యాపిల్ కంపెనీ షేర్ ధర ఒక డాలర్ ఉండేది. 2005లో యాపిల్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు దీని షేర్ ధర రూ.17 డాలర్లకు చేరుకుంది తాజాగా దీని షేర్ విలువ 2.8 శాతంపెరిగి 207.05 డాలర్లను టచ్ చేయటంతో లక్ష కోట్ల డాలర్ల మైలురాయికి చేరుకొని.. ఈ ఘనత సాధించిన మొదటి కంపెనీగా ప్రపంచంలో నిలిచింది. యాపిల్ కంపెనీ 40 ఏళ్ల ప్రయాణంలో ఈ కంపెనీ షేర్ ఏకంగా 50వేల శాతం పెరగటం గమనార్హం. ఇక.. యాపిల్ షేర్లు 482.99 కోట్లుగా చెబుతారు.