Begin typing your search above and press return to search.
భారతీయ అభిమానులను ఆకట్టుకున్న ఐఫోన్ 13 ప్రకటన
By: Tupaki Desk | 18 Sep 2021 2:30 AM GMTప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ కొత్త ఫోన్ విడుదలైంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా బుకింగ్ లు జోరుగా సాగుతున్నాయి. అన్ని దేశాల వారు ఎగబడి కొంటున్నారు. భారతీయులు దీని కోసం ఎగబడుతున్నారు. డిజైన్ పరంగా ఐఫోన్12 , ఐఫోన్13 మధ్య పెద్ద మార్పు లేనప్పటికీ స్పెసిఫికేషన్‌లు, కొన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఫీచర్లు, ధరలన్నింటికంటే ఆసక్తి రేపేలా ఉంది ఐఫోన్ వీడియో ప్రకటన. ఈ ఆపిల్ ఐఫోన్ యాడ్ భారతీయ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆపిల్ ఒక వీడియో ప్రకటనతో వినియోగదారుల ముందుకొచ్చింది. అక్కడ డెలివరీ బాయ్ పని చేయడానికి పరుగెత్తడం, బైక్ మీద త్వరగా ఆహారం అందించడం.. అతడు ఐఫోన్ 13 సహాయంతో వీటిని వేగంగా పూర్తి చేయడం చూపించారు. ఫోన్ కఠినమైన సిరామిక్ డిజైన్ , వాటర్ ఫ్రూఫింగ్ భద్రత, వినియోగదారులకు చూపించారు. ఎలాంటి వాతావరణలో అయినా సీల్డ్, సురక్షితంగా ఫోన్ ను ఉంచుతుందని.. కింద పడ్డా ఏం కాదు అని నాణ్యతతో తయారు చేశారని ప్రకటనలో హైలైట్ చేశారు.
అయితే ఆర్డీ బర్మన్ 'దమ్ మరో దమ్ పాట' నుండి తీసుకున్న గిటార్ స్ట్రమ్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఆకట్టుకుంటుంది. భారతీయ అభిమానులు అదే కారణంతో ఈ ప్రకటనను ఇష్టపడుతున్నారు.
అప్పట్లో ఐఫోన్12 సిరామిక్ బాడీ ఫోన్ ను ప్రకటించడానికి యాపిల్ సంస్థ భారతీయ సంగీతకారులు తబలాలో సృష్టించిన కర్ణాటక సంగీతాన్ని ఉపయోగించింది. ఆ ప్రకటన కూడా వైరల్ అయింది. ఐఫోన్ తయారీదారులు ప్రధానంగా భారత, దక్షిణాసియా మార్కెట్‌పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందుకే ఇక్కడ యువ కస్టమర్లను ఆకర్షించడానికి వారు భారతీయ సంగీతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంతలో భారతదేశంలో ఫోన్ అమ్మకాలు ఇంకా తెరవాల్సి ఉండగా పాత ఫోన్ బై బ్యాక్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్ ఇప్పటికే యాక్టివ్‌గా ఉంది.