Begin typing your search above and press return to search.
ఆపిల్ న్యూ సర్వీస్ : ఇప్పుడు తీసుకోండి తర్వాత పే చేయండి !
By: Tupaki Desk | 14 July 2021 11:30 AM GMTప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త పేమెంట్ సర్వీస్ ను తీసుకురాబోతోంది. ఈ కొత్త సర్వీసు ద్వారా మీకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ కొనుకోవచ్చు.. తర్వాత ఆన్ లైన్ ఇన్ స్టాల్ మెంట్సులో పేమెంట్ చేసుకోవచ్చు. ఆపిల్ పే యూజర్ల కోసం ఈ బై నౌ పే లెటర్ (బి ఎన్ పి ఎల్ ) అనే కొత్త సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అదే ఆపిల్ పే లెటర్ సర్వీసు, గోల్డ్ మ్యాన్ సాచ్స్ భాగస్వామ్యంలో ఆపిల్ ఈ కొత్త సర్వీసుపై పని చేస్తోంది.
ఒకసారి ఈ సర్వీసు అందబాటులోకి వచ్చాక అన్ని స్టోర్లలో పేమెంట్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును రెండు విధాలు వినియోగించుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే వస్తువుకు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆపిల్ పే లో 4 ఆప్షన్ ఎంచుకుంటే, కొనుగోలు వస్తువుపై రెండు నెలల్లో వడ్డీ లేకుండా నాలుగు సార్లు పేమెంట్స్ చేసుకోవచ్చు. అంటే, ప్రతి రెండు వారాలకు ఒకసారి పేమెంట్ చేసుకోవచ్చు.
అలాగే, ఆపిల్ పే యూజర్లు ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇందులో మరో ఆప్షన్ కూడా ఉంది. మీ పేమెంట్ పిరియడ్ మరిన్ని నెలలకు పెంచుకోవచ్చు. అయితే దీనికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్ టెర్మ్ ప్లాన్లపై మాత్రమే వడ్డీ ఉంటుంది. అందులో పేమెంట్ ప్లాన్లు, లేట్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉంటాయి. బ్లూమ్బెర్గ్ రిపోర్టు ప్రకారం.. కొనుగోళ్లపై ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుందో తెలియాలంటే ఆపిల్ ఈ పేమెంట్ సర్వీసును లాంచ్ చేసే వరకు వేచిచూడాల్సిందే.. ఈ కొత్త పేమెంట్ సర్వీసు రిపోర్టుపై ఆపిల్ అధికారికంగా స్పందించలేదు. ఇప్పటికే ఆపిల్ కార్డ్ సర్వీసును అందిస్తున్న సంగతి తెలిసిందే.