Begin typing your search above and press return to search.
రెండు నెలల్లో అదిరిపోయే ఆపిల్ క్యాంపస్ చూస్తారు
By: Tupaki Desk | 24 Feb 2017 4:53 PM GMTఆపిల్ సంస్థ కొత్త క్యాంపస్ గురించి ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ఏమిటంటే...మరో రెండు నెలల్లో కొత్త క్యాంపస్ లోకి మారబోతోంది. అదే రోజు స్టీవ్ జాబ్స్ పేరిట స్పెషల్ థియేటర్ ను కూడా ప్రారంభించనున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న పాత ఆఫీస్ నుంచి దాదాపు 12 వేల మందిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన చివరి ప్రాజెక్టును 35వేల కోట్లతో నిర్మించాలని అనుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినో నగరంలో ఆపిల్ క్యాంపస్ 2 భవనాన్ని ఇంత మొత్తంతో కట్టాలనుకున్నారు. దాదాపు 24 మంది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంతకాలు చేశారు. అయితే అదంత సులభం కాదని వారు పేర్కొన్నారు. 2011లో ఆపిల్ తన పథకాలను వెల్లడించింది. 2015 కల్లా దీనిని ప్రారంభించాలని స్టీవ్ అనుకున్నారు. ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని ఆపిల్ వెల్లడించలేదు. అయితే దీనికి దాదాపు 35వేల కోట్లు ఖర్చవుతుందని మాజీ ప్రాజెక్టు మేనేజర్లు అంచనా వేశారు.
ఆపిల్ క్యాంపస్2 - తమ వ్యాపారసామ్రాజ్యంలో భాగంగా, ఉద్యోగులు అత్యుత్తమ వాతావరణంలో, అత్యంత సంతోషంగా పనిచేయడానికి వీలుగా ప్రపంచ ప్రఖ్యాత కంప్యూటర్ సంస్థ - ఆపిల్ - కొత్త క్యాంపస్ ను నభూతో అన్న రీతీలో నిర్మిస్తోంది. ప్రకృతికి నష్టంకలగని రీతిలో, అత్యాధునిక సాంకేతిక హంగులతో, నిర్మాణరంగంలోనే ఒక అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దివంగత స్టీవ్ జాబ్స్ కలల సౌధంగా తయారవుతున్న ఈ భవంతి, డిజైన్‌పరంగా కూడా జాబ్స్ ప్రతిపాదనలనే అవలంబిస్తోంది.
కాలిఫోర్నియాః ఆపిల్ కంప్యూటర్స్ - పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అభిమానులుగా కల ఐఫోన్, ఐమ్యాక్ తయారీసంస్థ. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం-క్యుటర్టినో నగరంలో ఆపిల్‌కు అతిపెద్ద కార్యాలయం ఉంది. దానికి తూర్పున దాదాపు ఒక మైలు దూరంలో తన రెండో కార్యాలయాన్ని నిర్మించింది. ఈ సంవత్సరంలోనే గృహప్రవేశం జరుపుకునే ఈ ఆఫీస్, ప్రపంచంలోని ఏ ఇతర కార్యాలయాలకన్నా అత్యద్భుత సౌలభ్యాలతో, అందచందాలతో అలరారబోతోంది. కేవలం ఉద్యోగే కేంద్రంగా నిర్మించబడిన ఈ ఆఫీస్ విశేషాలేంటో తెలుసుకుందాం.
క్యుపర్టినో నగరంలో ఇంకో ప్రఖ్యాత కంప్యూటర్ సంస్థ హెచ్ పి కి కూడా పెద్ద కార్యాలయం ఉంది. అదికూడా ప్రస్తుత ఆపిల్ ఆఫీసుకి ఒక మైలు దూరంలోనే. హెచ్‌పితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంకో తొమ్మిది ఆఫీసులను కూడా కొనేసి మొత్తం 176 ఎకరాల ప్రాంతాన్ని తన కొత్త ఆఫీసుకోసం ఆపిల్ సిద్ధం చేసింది. ఆ ప్రాంతంతో సహజసిద్ధంగా పెరిగిన రకరకాల చెట్లు, పొదలకు ఎటువంటి హాని జరుగకుండా, కొన్నింటిని అలాగే ఉంచేసి, కొన్ని చెట్లను పెకలించి, వారి ల్యాండ్‌స్కేప్ డిజైనుకు అనువుగా మళ్లీ పాతించింది. ఈ వ్యవహారం కోసం ప్రత్యేకంగా ఒక చెట్ల డాక్టర్‌ను కూడా నియమించుకుంది. ఈ 176 ఎకరాల్లో భవంతుల శాతం కేవలం 20 మాత్రమే. మిగతా 80శాతమంతా పచ్చదనమే. ఎటుచూసినా పచ్చదనమే. స్టీవ్ జాబ్స్ అలోచనమేరకే ఇలా ఏర్పాటు చేశారు.
డిజైన్ః
నియో-ఫ్యూచరిజం (నవీన భవిత) అనే థీమ్‌తో నిర్మించబడిన ఈ క్యాంపస్, పూర్తిగా ఆపిల్ విధానపరమైన ఆలోచనలకు అనుగుణంగా అంటే.. గతమెంత ఘనమైనా, అటువైపు తొంగిచూడకుండా కొత్త భవిష్యత్తును నిర్మించడం. అందులో భాగంగానే ప్రధాన భవంతి పూర్తిగా అంతరిక్ష నౌకను పోలివుంటుంది. దాదాపు అన్నిగోడలూ వన్ వే సీ త్రూ(లోపలినుంచి బైటికి మాత్రమే కనిపిస్తుంది)గాజుపలకలతో నిర్మితమైనాయి. దాదాపు ఒక మైలు చుట్టుకొలతతో ఉంటుంది. కేవలం గాజుపలకల పొడవే 6 కిలోమీటర్లు. మధ్యలో ఉండే ప్రాంతమంతా హరితకాంతులతో, ఎటుచూసినా పచ్చదనంతో, బ్రహ్మాండమైన గార్డెన్ గా తయారుచేశారు. దీని మధ్యలో ఒక పెద్ద ఫౌంటేన్, దాని పక్కన ఒక స్టేజి నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత కట్టడాలను డిజైన్ చేసిన ఫాస్టర్స్ అండ్ పార్ట్‌నర్స్ దీని ఆర్కిటెక్ట్ కంపెనీ. ఆపిల్ ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో, ఈ నిర్మాణానికి వాడిన సామాగ్రి విషయంలో కూడా అంతే కఠినంగా ఉంది. ఇంతపెద్ద క్యాంపస్‌లో ఉండాల్సిన అగ్నిమాపక వ్యవస్థను కూడా ఆపిల్ అత్యంత పటిష్టంగా రూపొందించింది. దీన్నిబట్టే అమెరికా ప్రభుత్వం కూడా తన అగ్నిమాపక చట్టానికి మార్పులు చేసింది. ప్రతీ చిన్నదానికి కూడా ఆపిల్ ఒక విధానపత్రాన్ని రూపొందించి కాంట్రాక్టర్‌కు అందించింది. తూచా తప్పకుండా పాటించాల్సిందేనని హెచ్చరించింది. ఇలా అనవసర ఉచిత సలహాలు ఇచ్చినందుకే ఇంత పెద్ద ప్రాజెక్టుకు కాంట్రాక్టర్‌ను తీసేసి ఇంకో కంపెనీకి ఇచ్చింది.
అంతర్గత సొబగులుః
ఎక్కడా అతుకు కనబడకుండా, గోడలు, సీలింగ్ అన్నీ తొలిచినట్లుగా ఒకేరీతిన మౌల్డ్ చేసినట్లు జారిపోయేవిధంగా తయారుచేశారు. ఇది కూడా స్టీవ్ జాబ్స్ అలోచనే. చుట్టూ,మధ్యలో ఉన్న చెట్లు, ఉద్యానవనాల వల్ల సంవత్సరంలో తొమ్మిది నెలలు అసలు ఏసీలు, హీటర్లు వాడకుండానే లోపల చాలా అహ్లాదంగా ఉంటుంది. ఇంతపెద్ద భవంతి కావడంవల్ల మధ్యమధ్యలో కెఫేటేరియాలు, లాబీలు నెలకొల్పింది. వివిధ విభాగాలుగా పనిచేసే ఈ కార్యాలయంలో కలిసి పనిచేయాల్సిన విభాగాలన్నింటినీ పక్కపక్కనే నెలకొల్పి, ఉద్యోగుల శ్రమ తగ్గించారు. ప్రతీ ఉద్యోగి డెస్క్, కుర్చీని కూడా వాడకాన్ని బట్టి అత్యంత ఖచ్చితత్వంతో డిజైన్ చేశారు. ఇక్కడ వాడబడిన ప్రతీ స్విచ్ కూడా ఐఫోన్ బటన్లను పోలివుంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, వైర్‌లెస్ వ్యవస్థ అంతా కూడా అత్యాధునిక సాంకేతిక, భద్రతతో నెలకొల్పారు.
రెస్టారెంట్ః
ఇక్కడి రెస్టారెంట్, ఫైవ్‌స్టార్ హోటల్ కన్నా చాలా బాగుంటుంది. గార్డెన్‌లోకి దారితీసే విధంగా దీన్ని నిర్మించారు. రెండు అంతస్థులతో, చాలా పెద్దగా ఉండే ఈ కెఫెటేరియాలో దొరకని తిండి ఉండదు. అన్నీ ఫ్రీనే. అన్నీ అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. పూర్తిగా ఆపిల్ ఉద్యోగులకే ఇందులో ప్రవేశం. ఇది కాక, ప్రతీ అంతస్థులో, నాలుగైదు మినీ కెఫేలుంటాయి.
ఓపెన్ ఆఫీస్
ఎప్పుడూ ఆఫీస్ వాతావరణంలో పనిచేస్తే, బోర్ కొట్టి, పనిలో నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉందని భావించిన ఆపిల్, భవంతి బయట గార్డెన్లో 500 భారీ టేబుళ్లు వేయించి, సకల సౌకర్యాలను అక్కడే ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ మ్యాక్‌బుక్‌లతో వెళ్తే చాలు. అక్కన్నుంచే పనిచేసుకోవచ్చు.
వెల్‌నెస్ సెంటర్ః
ఈ భవంతిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వెల్‌నెస్ సెంటర్, సిలికాన్ వ్యాలీలో పనిచేసే మొత్తం ఆపిల్ ఉద్యోగులు దాదాపు 20వేల మంది అవసరాలను తీర్చే విధంగా 75కోట్ల డాలర్లతో నెలకొల్పారు. అన్నిరకాల వైద్యసేవలు, వ్యాయామకేంద్రాలు దీని సొంతం. ఇవికాక పది అత్యాధునిక వైద్య పరికరాలున్న అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి.
విద్యుత్ వినియోగం
క్యాంపస్ పూర్తి అవసరాలకు సరిపోయేవిధంగా ఒక పవర్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. 100శాతం సొంత విద్యుత్తు ఇక్కడే తయారవుతుంది. దీనికోసం వర్తులాకార భవంతి పైభాగం మొత్తం భారీస్థాయిలో సౌరవిద్యుత్ పలకలు నెలకొల్పారు. ఇంకా బయోడీజిల్ లాంటి సంప్రదాయేతర ఇంధనవనరులను కూడా వాడబోతున్నారు. ప్రభుత్వ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుంది కానీ, దాన్ని బ్యాకప్ కోసం అట్టిపెట్టుకున్నారు. క్యాంపస్ చుట్టూ 7000 భారీ వృక్షాలను నాటారు.
పార్కింగ్ః
పార్కింగ్ సదుపాయాన్ని భవంతి మధ్యలో ఉండే గార్డెన్ కింద సెల్లార్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 14వేల కార్ల పార్కింగ్ సామర్థ్యం గల ఈ సౌలభ్యం బహుళ అంతస్తుల్లో ఉంది. వెయ్యిమంది కూర్చోగల ఒక అద్భుతమైన థియేటర్ కూడా ఈ సెల్లార్ లోనే ఉంది.
ఇవేకాక, భవంతి చుట్టూ, మధ్య గార్డెన్ చుట్టూ మైళ్ల కొలదీ నడక, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్ లు కూడా నెలకొల్పారు. క్యాంపస్ అంతా కలియతిరగడానికి ప్రధాన గేటు వద్ద 1000 సైకిళ్లు, బైక్‌లు కూడా ఉంటాయి. సాధారణంగా భవన నిర్మాణంలో మనం పట్టించుకోని చిన్న చిన్న విషయాలను కూడా ఆపిల్ చాలా సీరియస్ గా తీసుకుంటుందని కంపెనీ సీనియర్ ఆర్కిటెక్ట్ ఒకరు తెలిపారు. ఆయన మాటల్లోనే, ఇది ముట్టుకోవడానికి కూడా జంకే ఒక అద్భుతమైన పెయింటింగ్ లాంటిది, ఏ మాత్రం అవకాశమున్నా, జీవితంలో ఒకసారైనా ప్రవేశించాలనిపించేది.
నిర్మాణ విశేషాలు
మొత్తం విస్తీర్ణం - 176 ఎకరాలు
అంతస్తులు - 4
నిర్మాణశైలి - నియోఫ్యూచరిజం
భవనం - వర్తులాకారం
భూమిపూజ - 2014
గృహప్రవేశం - 2017
భవనవిస్తీర్ణం - 28,00,000 చ.అడుగులు
మొత్తం వ్యయం - 500 కోట్ల డాలర్లు
భూమి కొనుగోలు - 16 కోట్ల డాలర్లు
ఆర్కిటెక్ట్ - ఫాస్టర్ అండ్ పార్టనర్స్
కాంట్రాక్టర్ - రుడాల్ఫ్-స్లెటెన్-హోల్డర్ కన్‌స్ట్రక్షన్స్
ఉద్యోగులు - 13,000లకు పైగా
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/