Begin typing your search above and press return to search.

యాపిల్ ఫోన్ ధరలో రూ.22 వేల కోత?

By:  Tupaki Desk   |   16 Sep 2016 4:11 AM GMT
యాపిల్ ఫోన్ ధరలో రూ.22 వేల కోత?
X
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ ఫోన్ వాడాలని తహతహలాడే వినియోగదారులకు కచ్ఛితంగా ఇది శుభవార్తే. తన ఉత్పతుల ధర విషయంలో అస్సలు రాజీ పడని యాపిల్.. తాజాగా తన మొబైళ్లలోని ఐఫోన్ 6ఎస్.. 6ఎస్ ప్లస్ ధరల్ని భారీగా తగ్గించినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ రెండువేరియంట్ల ధరలో భారీ కోత కోసినట్లుగా చెబుతున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేజ్రీ మోడల్స్ అయిన 6ఎస్.. 6ఎస్ ప్లస్ ధరల్ని పెద్ద ఎత్తున తగ్గించినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే యాపిల్ తన ఐఫోన్ 7.. ఐఫోన్ 7ప్లస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7న విడుదల చేస్తున్న ఈ కొత్త ఫోన్ల నేపథ్యంలో పాత మోడళ్ల ధరను భారీగా తగ్గించినట్లుగా చెబుతున్నారు. కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చే సమయంలో పాత మోడళ్ల దరల్ని తగ్గించటం మామూలే అయినా.. 6ఎస్..6ఎస్ ప్లస్ విషయంలో తగ్గింపు పెద్ద ఎత్తున ఉందని చెప్పొచ్చు. ఈ రెండువేరియంట్ల ధరలు భారీగా తగ్గించేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో ఉన్న ధరలో దాదాపు రూ.20వేల నుంచి రూ.22 వేల వరకూ కోత పెట్టినట్లుగా చెబుతున్నారు. గతంలో రూ.70 వేలు.. 80 వేలు పలికిన ఫోన్ల ధరలు తాజా కోతతో రూ.20 నుంచి రూ.22వేల వరకూ తగ్గించినట్లుగా మార్కెట్ వర్గాల సమాచారం. అదే జరిగితే.. తాజాగా బయటకు వచ్చిన కోత మాట పెద్దదిగా చెబుతున్నారు. కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చే టైంలో పాత వాటిపై ధరలు తగ్గించటం అలవాటైన వ్యవహారమే అయినా.. ఇంత భారీ ఎత్తున కోత మాత్రం అరుదుగా అభిప్రాయపడుతున్నారు. మరి.. మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారాన్ని ఎంతవరకు నమ్మచ్చన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ ఐఫోన్ల ధరల తగ్గింపు మాటే నిజమైన పక్షంలో ఐఫోన్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి పండగనే చెప్పకతప్పదు.