Begin typing your search above and press return to search.

యాపిల్ కంపెనీ నుంచి పారిపోని వారి పంట పండింది.. నాలుగింతల బోనస్

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:30 AM GMT
యాపిల్ కంపెనీ నుంచి పారిపోని వారి పంట పండింది.. నాలుగింతల బోనస్
X
ఆపిల్ కంపెనీకి ప్రధాన సరఫరాదారు ఫాక్స్‌కాన్ కంపెనీ. మంగళవారం సెంట్రల్ చైనాలోని ఫాక్స్ కాన్ జెంగ్‌జౌ ప్లాంట్‌లోని కార్మికులు అంతా చైనాలో విధించిన కోవిడ్ నియంత్రణలపై అసంతృప్తి చెందిన ప్లాంట్ గోడ దూకి పారిపోయారు. ఐఫోన్ తయారీ పరిశ్రమలోని సిబ్బంది కరోనా ఆంక్షల్లో తాము పనిచేయమంటూ ఇలా పారిపోవడం వైరల్ అయ్యింది. అయితే ఇలా గోడ దూకి పోకుండా ప్లాంట్ లో పనిచేస్తున్న వారి పంట పండింది. వారికి బోనస్‌లను నాలుగు రెట్లు పెంచినట్లు సంస్థ తెలిపింది. కంపెనీలో స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్స్‌ను తయారు చేసే బాధ్యత కలిగిన ఫాక్స్‌కాన్ యూనిట్‌లో భాగమైన ఉద్యోగులకు రోజువారీ బోనస్‌లు నవంబర్‌లో 100 యువాన్‌ల నుండి రోజుకు 400 యువాన్‌లకు ($55) పెంచబడ్డాయని వివరించారు. .

ఫాక్స్ కాన్ సంస్థ అధికారికంగా యాపిల్ కంపెనీ యొక్క అతిపెద్ద ఐఫోన్ తయారీదారు. ప్రపంచవ్యాప్తంగా 70% ఐఫోన్లను ఈ కంపెనీయే ఉత్పత్తి చేస్తోంది. ఇది భారతదేశం , దక్షిణ చైనాలో ఇతర చిన్న ఉత్పత్తి కంపెనీలను కలిగి ఉన్నప్పటికీ, దాదాపు 200,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న చైనాలోని జెంగ్‌జౌ ప్లాంట్‌ అతిపెద్దది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫోన్‌లను తయారు చేస్తుంది.

చైనాలో మళ్లీ మొదలైన కోవిడ్19 వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన చర్యలను అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి నిరసనగా అనేక మంది కార్మికులు సోషల్ మీడియా ద్వారా వారి చికిత్స మరియు నిబంధనల గురించి ఆందోళన చెంది కంపెనీ గోడ దూరి పనిచేయమంటూ పారిపోయారు. కార్మికులను "దయనీయమైన పరిస్థితులలో" ఉంచే ప్రభుత్వ సూచనలను అనుసరించమని వారంతా ఇలా చేశారు. దీంతో ఫాక్స్‌కాన్‌కు వేరే మార్గం లేకుండా పోయింది. ఉన్నవారికి నాలుగింతల బోనస్ ప్రకటించి పనులు చేయిస్తోంది.

పరిస్థితి కారణంగా ప్లాంట్‌లో నవంబర్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తి 30% వరకు క్షీణించవచ్చని.. లోటును భర్తీ చేయడానికి షెన్‌జెన్‌లోని మరొక ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచడానికి ఫాక్స్‌కాన్ కృషి చేస్తోందని కంపెనీ తెలిపింది. ఏదైనా సెలవును వదులుకోవడంతో సహా ఎక్కువగా పనిచేసే కార్మికులకు నెలకు మొత్తం 15,000 యువాన్ల బోనస్‌ను చెల్లిస్తామని నోటీసులు పేర్కొంది.

ఒక సాధారణ ఫాక్స్‌కాన్ కార్మికుడు నెలకు 3,000 నుండి 4,000 యువాన్ల మధ్య సంపాదిస్తాడు.ఆఫర్‌పై బోనస్‌లు ఉన్నప్పటికీ చాలామంది కరోనా ఆంక్షలతో ముందుకు రావడం లేదు. ఎందుకంటే వారు ఎదుర్కొన్నది "భయంకరమైన కరోనా అనుభవాలు.. అదనపు డబ్బు కోసం ఇక్కడ పనిచేయలేమని వారు అంటున్నారు.

కరోనా పట్ల చైనా కఠిన ఆంక్షలు విధిస్తోంది. లాక్‌డౌన్‌లతో సహా చర్యలతో వ్యాప్తిని అరికట్టడానికి నానా రకాల ఇబ్బందులు పెడుతోంది. ప్రభావిత ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు "క్లోజ్డ్ లూప్" సిస్టమ్‌లో సిబ్బంది నివసించే.. దీనిపై ఉద్యోగులు, వ్యాపారాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అందుకే పని మానేసి ఉద్యోగులంతా పారిపోతున్న పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.