Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఆపిల్ ఉద్యోగిని ఆచూకీ లభించింది

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:46 AM GMT
హైదరాబాద్ ఆపిల్ ఉద్యోగిని ఆచూకీ లభించింది
X
గడిచిన 20 రోజులుగా హైదరాబాద్ పోలీసులకు పెద్ద టెన్షన్ గా మారిన ఐటీ ఉద్యోగిని మిస్సింగ్ కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఆపిల్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేసే రోహిత డిసెంబరు 26న ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. తిరిగి ఆమె ఇంటికి వెళ్లలేదు. దీంతో.. ఆమె కోసం వెతికిన కుటుంబ సభ్యులు డిసెంబరు 29న తమ కుమార్తె కనిపించటం లేదంటూ మిస్సింగ్ ఫిర్యాదును ఇవ్వగా.. పోలీసులు నమోదు చేశారు.

కలకలం రేపిన రోహిత్ మిస్సింగ్ కేసు వ్యవహారం కొన్ని మీడియాలలో ప్రముఖంగా వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. విచారణను ముమ్మురం చేశారు. ఆమె ఆచూకీని గుర్తించేందుకు ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.

తన బ్యాంకు ఖాతా నుంచి రూ.80వేల మొత్తాన్ని డ్రా చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే ముందు ఆమె ఫోన్ కూడా తీసుకెళ్లలేదని గుర్తించిన పోలీసులు.. ఆమె మొబైల్ ను అన్ లాక్ చేసి కాల్ డేటాను పరిశీలించారు. దీని ప్రకారం భర్తతో విబేదాలున్న రోహిత విడిగా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఆమె ఫుణెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.