Begin typing your search above and press return to search.
ఐఫోన్ 7 లాంచింగ్..ఆహ్వానాలు వచ్చేశాయ్!
By: Tupaki Desk | 30 Aug 2016 9:43 AM GMTఐఫోన్ కొత్త వెర్షన్ వస్తోందంటే చాలు... ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులకు పండుగ అని చెప్పాలి. ఆపిల్ ఐఫోన్ 7 గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. గత సిరీస్ ఫోన్లకంటే విభిన్నంగా ఉంటుందనీ, అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉండబోతాయని.. ఇలా చాలా అంచనాలే నెలకొన్నాయి. అయితే, ఈ ఎదురుచూపులకు తెరదించుతూ త్వరలోనే ఒక శుభవార్తను వినిపించబోతోంది ఆపిల్ సంస్థ.
సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియంలో ఒక భారీ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థలకు ఆపిల్ ఆహ్వానాలు పంపింది. ఈ ఈవెంటులోనే ఆపిల్ ఐఫోన్ 7ను వినియోగదారులకు పరిచయం చేస్తుందని ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఏయే డివైజ్ లను లాంచ్ చేస్తారన్నది మాత్రం ఆహ్వానంలో పేర్కొనలేదు. కానీ, ఆపిల్ ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్లస్ లతోపాటు కొత్త తరం ఐవాచ్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచే కొత్త ప్రాడెక్టులకు ప్రీ ఆర్డర్ తీసుకుంటారనీ, అదే నెల 16 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయని ఫోర్బ్స్ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ నోట్ 7కి ధీటుగా కొత్త ఐఫోన్ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీని స్పెక్స్ గురించి చాలా అంచనాలున్నాయి. ఈసారి ఐఫోన్ లో 3.5 ఎం.ఎం. ఆడియో జాక్ ఉండదని అంటున్నారు. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే హెడ్ ఫోన్స్ ఉంటాయని అంటున్నారు. అలానే, డ్యుయెల్ కెమెరాతోపాటు బయోమెట్రిక్ ఇంటిగ్రేషన్ - టైప్ సీ పోర్టులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి, ఈ అంచనాలన్నింటికీ తెర దించుతూ సెప్టెంబర్ 7న ఆపిల్ అభిమానులకు శుభవార్త అందుతుంది.