Begin typing your search above and press return to search.

యాపిల్ డౌన్ ఫాల్‌..!

By:  Tupaki Desk   |   28 Jan 2016 1:30 AM GMT
యాపిల్ డౌన్ ఫాల్‌..!
X
మార్పు ఒక్క‌టే శాశ్వితం అంటారు. మార్పును ఆహ్వానించి.. అందుకు త‌గ్గ‌ట్లు మార‌కుంటే జ‌రిగే న‌ష్టం ఎలా ఉంటుందో ఒకప్ప‌టి మొబైల్ దిగ్గ‌జం నోకియాను చూస్తే అర్థ‌మ‌వుతుంది. మొబైల్ మార్కెట్ లో త‌న‌దైన శైలిలో దూసుకెళుతూ ఉంటే యాపిల్ ఫోన్ల‌కు ఉన్న క్రేజ్ ఎంతో తెలిసిందే. అయితే.. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఈ ఫోన్ల అమ్మ‌కాలు త‌గ్గిపోవ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. యాపిల్ సంస్థ ఆదాయంలో 68 శాతం ఫోన్ల మీద‌నే వ‌స్తున్న ఈ కంపెనీకి.. తాజాగా ఫోన్ల అమ్మ‌కాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌టం ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతోంది.

ధ‌ర‌లు భారీగా ఉండ‌టం.. కొత్త కొత్త మోడ‌ల్స్ తో చౌక ధ‌ర‌కు పెద్ద పెద్ద కంపెనీలు ఫోన్లు వస్తున్న ప‌రిస్థితి. అయితే.. ఏదీ యాపిల్ సాటి రాన‌ప్ప‌టికీ.. కొత్త మోడ‌ళ్ల ముందు.. వాటి ధ‌ర‌ల ముందు యాపిల్ క‌ళ త‌గ్గుతుంద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు అండ్రాయిడ్ జోరు కూడా కార‌ణంగా చెబుతున్నారు.

కార‌ణాలు ఏమైనా కానీ.. 2007 త‌ర్వాత అమ్మ‌కాలు క్షీణించ‌టం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో 74.8 మిలియ‌న్ ఐఫోన్లు అమ్మితే.. ఈ ఏడాది ఇదేకాలంలో చూస్తే మాత్రం ఆశించినంతగా అమ్మ‌కాల్లో వృద్ధి లేద‌ని తేల్చారు. రాబోయే త్రైమాసికం అమ్మ‌కాల విష‌యంలో క్షీణ‌త త‌ప్ప‌ద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే..యాపిల్ కంపెనీ ఆదాయం మీద కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ క‌ష్టాన్ని ఎదుర్కోవ‌టానికి యాపిల్ ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తుందో..?