Begin typing your search above and press return to search.

మీకు ఓటు లేదా? నో ప్రాబ్లం.. 5 రోజులున్నాయ్!

By:  Tupaki Desk   |   11 March 2019 4:15 AM GMT
మీకు ఓటు లేదా? నో ప్రాబ్లం.. 5 రోజులున్నాయ్!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు.. ప‌లు రాష్ట్రాల్లోజ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.గ‌డిచిన కొద్ది రోజులుగా అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌టం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌తానికి భిన్నంగా మొద‌టి విడ‌త‌లోనే పోలింగ్ పూర్తి అవుతున్న ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రి దృష్టి తాజాగా జ‌రిగే ఎన్నిక‌ల మీద‌నే ఉంది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల వేళ మీ ఓటు ఉందా? లేదా? అన్న‌ది ఒక‌సారి చెక్ చేసుకోవాల్సిన అవ‌స‌రంఉంది. మిగిలిన ప‌నుల్ని ప‌క్క‌న పెట్టి.. పోలింగ్ రోజున ఆగ్ర‌హం.. ఆక్రోశాన్ని వ్య‌క్తం చేయ‌కుండా ముందే మేలుకొని.. ఓటు ఉందా? లేదా? అన్న‌ది చెక్ చేసుకుంటే మంచిది.

ఒక‌వేళ ఓటు లేకుంటే.. ఐదు రోజుల పాటు ఓటుహ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంది. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. అర్హ‌త ఉన్న ఓట‌ర్లు త‌మ ఓట్ల‌ను న‌మోదు చేసుకునే చివరి అవ‌కాశంగా ఈ ఐదు రోజుల్ని చెప్పాలి. ఎవ‌రికి వారు త‌మ ఓటును త‌నిఖీ చేసుకోవ‌టం.. లేకుంటే వెంట‌నే ఫామ్ 6 అప్లికేష‌న్ ను నింపి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ లో కానీ.. వెబ్ సైట్ ద్వారా కానీ.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మొబైల్ యాప్ ద్వారా కానీ ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంది. మ‌రిక‌.. ఆల‌స్యం ఎందుకు ఎవ‌రికి వారు త‌మ ఓటు ఓట‌ర్ల జాబితాలో ఉందో.. లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. త‌ర్వాత ఫీల్ అయ్యే కంటే.. ముందే మేల్కొంటే మంచిది.