Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారుపై విద్యార్థులే గెలిచారు

By:  Tupaki Desk   |   8 May 2017 5:54 PM GMT
ఏపీ స‌ర్కారుపై విద్యార్థులే గెలిచారు
X
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్ష జులై 15, 16 తేదీలకు వాయిదా వేసింది. జులై రెండో వారం జరగాల్సిన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ పరీక్షను జులై 30కి వాయిదా వేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. సిలబస్‌లో వ్యత్యాసం ఉన్నందున అభ్యర్థులకు గడువు ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాల‌ని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌చ్చాయి. విద్యార్థుల నుంచి వ‌చ్చిన ఈ డిమాండ్‌కు వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌ద్ద‌తు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేత‌లు ఏపీపీఎస్‌సీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్య‌మించారు. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ స్పందించారు. విద్యార్థులు కోరిన‌ట్లు మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు లేఖ రాశారు. మ‌రోవైపు ఈ డిమాండ్ల అనంత‌రం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా డిమాండ్‌పై అభిప్రాయం సేకరించేందుకు ఏపీపీఎస్‌సీ ముందుకు వ‌చ్చింది. క్వాలిఫై అయిన అభ్యర్థులు ప‌రీక్ష వాయిదా గురించి త‌మ వెబ్‌సైట్ లో అభిప్రాయం తెలిపే అవకాశం కల్పించిన‌ట్లు వెల్ల‌డించింది. అనంత‌రం తాజాగా నిర్ణ‌యం వెలువ‌రించింది. కాగా, క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక రాష్ర్ట ప్ర‌భుత్వంపై ప‌డిన ఒత్తిడి, ఏపీపీఎస్‌సీకి ప్ర‌భుత్వం చేసిన సూచ‌న ఫ‌లిత‌మేన‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.