Begin typing your search above and press return to search.

కొత్త మంత్రుల‌కు ఒక రోజు ముందుగా!

By:  Tupaki Desk   |   30 March 2022 8:30 AM GMT
కొత్త మంత్రుల‌కు ఒక రోజు ముందుగా!
X
జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు చేస్తారు? కొత్త కేబినేట్లో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారు? ఎంత‌మంది పాత‌వాళ్ల‌కు ఉద్వాస‌న ప‌లుకుతారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం వ‌చ్చేసింది. ఏపీ రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు జ‌గ‌న్ ముహూర్తం పెట్టేశార‌ని తెలిసింది.

ఏప్రిల 11న కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించి మూడు రోజుల ముందుగా అంటే ఏప్రిల్ 8న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ గురించి గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ తెలియ‌జేస్తార‌ని తెలుస్తోంది.

దాదాపుగా అంద‌రూ..

జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించ‌బోయే కేబినేట్లో దాదాపు అన్ని కొత్త ముఖాలే ఉండ‌బోతున్నాయ‌ని స‌మాచారం. దాదాపు 90 శాతం మంత్రుల‌పై వేటు వేసి వాళ్ల స్థానాల‌ను కొత్త వాళ్ల‌తో భ‌ర్తీ చేయ‌నున్నార‌ని వైసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంత్రి ప‌ద‌వి అందుకోబోతున్న నాయ‌కుల‌కు ఒక రోజు ముందుగా స‌మాచారం ఇస్తార‌ని తెలుస్తోంది. కేబినెట్ విస్త‌ర‌ణ త‌ర్వాత మాజీ, తాజా మంత్రుల‌కు జ‌గ‌న్ విందు ఇస్తారు. త‌న స‌హ‌చ‌రుల‌కు మార్గ నిర్దేశం చేస్తార‌ని టాక్‌. రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్‌లో మార్పులు చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు. ఇప్పుడు ప‌ద‌వుల పోయిన మంత్రుల‌కు జిల్లాల బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఆ ఎన్నిక‌లు ల‌క్ష్యంగా..

2024 ఎన్నిక‌ల‌కు పార్టీని ఇప్ప‌టి నుంచే సిద్ధం చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న‌టువంటి ప‌రిస్థితులు 2024 నాటికి ఉండ‌వని ఆయ‌న‌కు తెలియంది కాదు. అందుకే ఇప్ప‌టి నుంచే పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించి వ‌చ్చే ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. మంత్రు ప‌ద‌వులు పోయిన నాయ‌కుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్నారు. జిల్లా అధ్య‌క్షులుగా.. ప్రాంతీయ మండ‌ళ్ల అధ్యక్షులుగా వాళ్ల‌ను నియమించ‌నున్నారు. పార్టీని ఎన్నిక‌ల‌కు సిద్ధం చేసే బాధ్య‌త వాళ్ల‌కు అప్ప‌గించ‌నున్నారు. అయితే ఇలా జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు చేప‌ట్టేందుకు మాజీగా మారే మంత్రుల్లో కొంత‌మంది సుముఖ‌త వ్య‌క్తం చేయ‌గా.. మ‌రికొంత మంది అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని టాక్‌. జ‌గన్ చెప్పింది చేస్తామ‌ని కొంత‌మంది నాయ‌కులు అంటున్నారు. కానీ మంత్రులుగా ప‌ని చేసిన తాము ఇప్పుడు జిల్లా అధ్య‌క్షులుగా చేయాలా? అని కొంత‌మంది ప్ర‌శ్నిస్తున్నారంటూ స‌మాచారం.