Begin typing your search above and press return to search.

జగన్ సీరియస్ నిర్ణయం.. అన్యమత ప్రచారంపై వేటు

By:  Tupaki Desk   |   26 Aug 2019 10:11 AM IST
జగన్ సీరియస్ నిర్ణయం.. అన్యమత ప్రచారంపై వేటు
X
తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది జగన్ సర్కారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసిన వైనంపై సీరియస్ కావటమే కాదు.. చర్యలు తీసుకుంటూ తన తీరును అర్థమయ్యేలా చేసింది జగన్ సర్కారు.

తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్ల వెనుక అన్యమత ప్రచారం చేసేలా ఉన్న ప్రకటన కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన జగన్ సర్కారు.. ఈ ఉదంతంపై ప్రాథమికంగా విచారణ జరిపారు. టికెట్ల రోల్స్ ను పంపిణీ చేయటంలో ఆర్టీసీ నెల్లూరు జోన్ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్ బాబుది తప్పుగా గుర్తించారు.

అతడి నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని తేల్చారు. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. జరిగిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆదేశించారు. జగదీష్ బాబు అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని.. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లినట్లుగా చెప్పారు. తప్పు జరిగిన వెంటనే.. అందుకు కారణమైన వారిపై చర్యల విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవన్న విషయాన్ని తాజా చర్యతో మరోసారి ఫ్రూవ్ చేసింది జగన్ సర్కార్.