Begin typing your search above and press return to search.

ఉద్యోగుల సమ్మెలో బిగ్ ట్విస్ట్... వారి ఎంట్రీతో... ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:31 PM GMT
ఉద్యోగుల సమ్మెలో బిగ్ ట్విస్ట్... వారి ఎంట్రీతో... ?
X
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారు, కానీ జనాలకు తెలిసేదెలా, ఇపుడు పనుల మీద ఆఫీసులకు వెళ్ళే ప్రజలు రెండు రోజులు ఆగి వెళ్తారు, ఉద్యోగుల గొడవ సెటిల్ అయ్యాకనే తమ పనులను చేసుకుంటారు, అప్పటిదాకా వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె అంటే వెంటనే ఇబ్బంది ఏదీ ప్రజలకు ఉండదు, అందువల్ల సమ్మె నొప్పి డైరెక్ట్ గా జనాలకు తెలియాలీ అంటే ఒకే ఒక సెక్షన్ రంగంలోకి దిగాలి. అదే ప్రజా రావాణా వ్యవస్థగా పేరు మార్చుకున్న ఆర్టీసీ.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని గతంలో ఆందోళన చేసిన వారికి జగన్ వస్తూనే ఆ కోరిక తీర్చారు. నిజానికి అది చిరకాల డిమాండ్. ఏ ప్రభుత్వం కూడా దాన్ని కనీసంగా కూడా కన్సిడర్ చేయలేదు. అంతవరకూ ఎందుకు పొరుగున ఉన్న తెలంగాణాలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేసీయార్ కరగలేదు.

అలాంటి మంచి పని చేసిన వైసీపీ సర్కార్ కి అండగా ఆర్టీసీ ఉద్యోగులు నిలుస్తారు అనుకుంటే పొరపాటే. వారు కూడా సమ్మె సైరన్ మోగిస్తున్నారు. తామూ సమ్మె బాటలోనే అంటున్నారు. మరి వారి బాధలు వారికి ఉన్నాయి. ప్రభుత్వం విలీనం చేసింది కానీ చాలా రకాలుగా ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఇక జీతాలు కూడా ఫస్ట్ కి రావడమే లెదుట. చాలా చాలా లేట్ అవుతున్నాయన్న బాధ ఉంది.

ఈ నేపధ్యంలో ఉద్యోగుల జేఏసీలో వారు కూడా భాగమవుతున్నారు. తాము కూడా సమ్మెలోకి వస్తున్నామని ఆర్టీసీ యూనియన్లు ప్రకటిస్తున్నాయి. అదే కనుక జరిగితే సమ్మె ఎఫెక్ట్ అలా ఇలా ఉండదు అంటున్నారు. డే వన్ నుంచి ఫస్ట్ హవర్ నుంచే సమ్మె దెబ్బ ఏంటో జనాలకు తెలిసిపోతుంది.

సరిగ్గా ఇలాంటి ఎత్తుగడతోనే జేఏసీ ఆర్టీసీని కూడా సమ్మె బాటన నడిపిస్తోంది అంటున్నారు. మొత్తానికి ఆర్టీసీ సమ్మె ఫిబ్రవరి 7 నుంచి మొదలైతే కొద్ది గంటల్లోనే జనాలు నరకం చూస్తారు. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోతే ప్రజా రవాణా స్థంభించిపోతే ప్రైవేట్ ఉద్యోగులతో పాటు బయటకు వచ్చే వారందరికీ తీరని ఇబ్బంది.

దాంతో సమ్మె ఒక రోజు గడవకముందే ప్రభుత్వం మీద నేరుగా జనాల వత్తిడి పెరుగుతుంది. సర్కార్ దిగిరావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద అటు ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం ఎపిసోడ్ లో ఆర్టీసీ స్టాఫ్ సమ్మెలోకి రావడమే అసలైన బిగ్ ట్విస్ట్ అంటున్నారు. చూడాలి మరి ఈ సమ్మె ఎఫెక్ట్ భారీగా ఉండనున్న నేపధ్యంలో ప్రభుత్వం అంతవరకూ సీన్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.