Begin typing your search above and press return to search.

సేవ్ ఏపీ పోలీస్ జగన్ సార్ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ యాత్రం

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:22 AM GMT
సేవ్ ఏపీ పోలీస్ జగన్ సార్ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ యాత్రం
X
అతడో ఏఆర్ కానిస్టేబుల్. అయినప్పటికీ అతను చేసిన ఒక ప్రయత్నం అతన్ని వార్తల్లోకి తీసుకొచ్చేలా చేసింది. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పోలీసు శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్.. ఏపీ పోలీసులకు జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పేందుకు ఓపెన్ గా బయటకు రావటమే ఒక సంచలనమైతే.. తాను చేస్తున్న వినతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరేందుకు వీలుగా తాజాగా సైకిల్ యాత్రను మొదలు పెట్టారు.

అనంతపురం జిల్లాకు చెందిన ప్రకాశ్.. 'ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీసు' అంటూ తన సైకిల్ యాత్రను షురూ చేశారు. అంతలో పోలీసులు వచ్చి.. అతడ్ని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.

పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని.. పోలీసులకు ఇవ్వాల్సిన గ్రాంట్లు.. టీఏ.. డీఏ.. ఎస్ఎల్ఎస్.. ఏఎస్ఎల్ఎస్ బకాయిల్ని ఇప్పటికి ఇవ్వలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని.. కక్ష కట్టి మరీ బకాయిలు ఇవ్వకపోవటంతో పండుగ వేళ పోలీసులు తెగ ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 358 మంది పోలీసుల్ని వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించినట్లుగా చెప్పారు.

బకాయిల విడుదల గురించి తాను మాట్లాడినందుకు తనను విధుల నుంచి తప్పించినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ప్రకాశ్ సైకిల్ యాత్రను పోలీసులు అడ్డుకోవటం.. అతడ్ని అరెస్టు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయితే.. సైకిల్ యాత్రకు అనుమతి తీసుకోని కారణంగానే అతడ్ని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.