Begin typing your search above and press return to search.
టాప్-500 ముస్లింలలో అమీర్-రెహ్మాన్-ఒవైసీ
By: Tupaki Desk | 13 Oct 2015 7:44 AM GMTప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 500 మంది ముస్లిం పర్సనాలిటీస్ జాబితాలో మన దేశానికి చెందిన 22 మంది ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్.. సీనియర్ నటి, దర్శకురాలు షబానా ఆజ్మీలతో పాటు ఆస్కార్, గ్రామీ అవార్డులతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్... బిజినెస్ టైకూన్ అజీన్ ప్రేమ్ జీ.. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. మరో ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ - హురియత్ నాయకుడు డాక్టర్ ఉమర్ ఫరూక్ కూడా టాప్-500 లిస్టులో ఉన్నారు.
జోర్డాన్ కు చెందిన ది రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ (ఆర్ ఐఎస్ ఎస్సీ) ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని దాదాపు ప్రతి రంగంలోనూ మన ముస్లిం ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలో ఇండొనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం భారతే. దేశంలోని 121 కోట్ల మందిలో 17.22 కోట్ల మంది (14.2 శాతం) జనాభా ముస్లింలే. గత ఏడాది ఈ జాబితాలో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. అబ్దుర్ రెహ్మాన్ ఈ ఏడాది మృతి చెందిన సంగతి తెలిసిందే.