Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారిన తండ్రీకూతుళ్ల 'ప‌ర‌దా' మాట‌లు

By:  Tupaki Desk   |   19 April 2017 9:19 AM GMT
వైర‌ల్ గా మారిన తండ్రీకూతుళ్ల ప‌ర‌దా మాట‌లు
X
ముస్లిం మ‌హిళ‌లు ప‌ర‌దా (హిజాబ్‌) వేసుకోవ‌టం చాలా కామ‌న్‌. కొంత‌మంది త‌ప్పించి.. చాలామంది ఇప్ప‌టికి ప‌ర‌దా వేసుకొనే ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ముస్లిం మ‌హిళ‌లు ప‌ర‌దాల్ని ప‌ట్టించుకున్నా.. కొంత‌మంది సంప్ర‌దాయ ముస్లిం కుటుంబాల్లో ఇప్ప‌టికీ ప‌ర‌దా ప‌ద్ధ‌తిని పాటిస్తుంటారు. దీనిపై ప‌లు దేశాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌టం తెలిసిందే. కొంద‌రు ప‌ర‌దా వ‌ద్దంటే.. మ‌రికొంద‌రు కావాల‌న్న మాట‌ను చెబుతుంటారు.ఈ చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే.. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన లామ్యా అనే అమ్మాయి త‌న స్నేహితురాలితో చాట్ చేసిన వైనం.. అనంత‌రం త‌న తండ్రితో చేసిన చాట్‌ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముస్లిం తండ్రీ కూతుళ్ల మ‌ధ్య సాగిన చాటింగ్ ఇప్పుడు మోస్ట్ వైర‌ల్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

లామ్యా ఫ్రెండ్‌తో చాట్ చేసే స‌మ‌యంలో.. త‌న తండ్రి త‌న‌ను ప‌ర‌దా వేసుకోవాల‌ని చెప్పార‌ని.. ఒక‌వేళ వేసుకోక‌పోతే సీరియ‌స్ అవుతార‌ని చెప్పింది. దీంతో.. లామ్యా ఆలోచ‌న‌లో ప‌డింది. త‌న స్నేహితురాలి తండ్రి మాదిరే త‌న తండ్రి కూడా స్పందిస్తారా? ప‌ర‌దా వేసుకోనంటే ఎలా రియాక్ట్ అవుతారు? అన్న సందేహం వ‌చ్చింది. వెంట‌నే ఫోన్ తీసుకొని.. తండ్రికి ఒక మెసేజ్ పోస్ట్ చేసింది.

అందులో విష‌యం ఏమిటంటే.. నేను ప‌ర‌దా వేసుకోవాల‌ని అనుకోవ‌టం లేదు.. మీలాంటి తండ్రులు కూతుళ్లు ప‌ర‌దా వేసుకోవాల‌ని అనుకుంటారు..ఎంతైనా మీ ఆలోచ‌న‌ధోర‌ణి అంతా ఒకేలా ఉంటుంది క‌దా? అంటూ క్వ‌శ్చ‌న్ వేసేసింది. దీనికి లామ్యా తండ్రి స‌మాధాన‌మిస్తూ.. "స్వీట్ హార్ట్ ఇది నా నిర్ణ‌యం కాదు. అలాంటి నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ఎవ‌రికీ లేదు. నీకు ఏద‌నిపిస్తే అది చేయ్‌. ఏమైనా నీకు నేనున్నా" అని ట్వీట్ చేశారు. దీనికి బదులుగా లామ్యా స్పందిస్తూ తాను ప‌ర‌దా తీయాల‌ని అనుకోవ‌ట్లేదంటూ స‌మాధానం ఇచ్చింది. ఈ తండ్రి కూతుళ్ల మ‌ధ్య సాగిన ట్వీట్ల కు 3.2 ల‌క్ష‌ల లైకులు.. 1.4 ల‌క్ష‌ల రీట్వీట్లు వ‌చ్చాయి. ఆచారాలు.. నిబంధ‌న‌ల పేరిట ఆడ‌పిల్ల‌ల‌కు ప‌రిమితులు విధించే వారికి భిన్నంగా ఒక కూతురికి తండ్రికి ఇచ్చిన స‌పోర్ట్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/