Begin typing your search above and press return to search.
శశికళ వర్గం ఆ ఎంపీని చంపాలనుకుంటోందట
By: Tupaki Desk | 29 Jun 2017 12:14 PM GMTఅన్నాడీఎంకే శశికళ వర్గం అగ్రనేతలు శశికళ - దినకరన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని.... ఇప్పటికే 32 సార్లు ఫోన్ చేశారని... చంపేస్తామని బెదిరిస్తున్నారని అదే వర్గానికి చెందిన అరక్కోణం ఎంపీ తిరుత్తణి జి. హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శశికళ - దినకరన్ మద్దతుదారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను ఆశ్రయించాడు. తాను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇవ్వడంతో శశికళ - దినకరన్ అనుచరులు తన ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారని ఎంపీ హరి వాపోయాడు. శశికళ నటరాజన్ - టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి మెడపట్టి బయటకు పంపించాలని మెజారిటీ శాతం ఎంపీలు - ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని... ఈ విషయం తాను మీడియా ముందు చెప్పడం వలనే తన ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. హరి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న పోలీసులు ఆ ఫోన్ లో రికార్డు అయిన గొంతు ఎవరిదన్నది పరిశీలిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు పలికేందుకు ముఖ్యమంత్రి పళనిసామి - జైల్లో ఉన్న శశికళను కలిసి చర్చించారని లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని హరి అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి పళనిసామి సొంతంగా నిర్ణయం తీసుకున్నారని.. శశికళతో ఆయన చర్చించలేదని హరి అంటున్నారు. అయితే సొంత లాభం కోసం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/