Begin typing your search above and press return to search.
ఏపీలో మరో కొత్త పార్టీ అవతరణ!
By: Tupaki Desk | 24 Aug 2018 1:32 PM GMT2019 ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పొత్తులు - ఎత్తులు పై ఎత్తులతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. తమ ఉనికిని చాటుకునేందుకు చిన్నా చితకా పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, నేడు `జన జాగృతి` పేరుతో కొత్తపల్లి గీత పార్టీని స్థాపించారు. విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించిన గీత పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. మార్పు కోసం ముందడుగు అనే పార్టీ నినాదంతో ముందుకు వెళతామని గీత అన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ జెండాను కూడా గీత విడుదల చేశారు. నీలం రంగు - తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించిన జెండాను ఆమె మీడియా ముందు విడుదల చేశారు.
ఏపీలో తాజాగా మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత `జనజాగృతి` పార్టీని నేడు స్థాపించారు. తాను డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని గీత అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ ఉందని - అందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. గిరిజన ప్రాంత సమస్యలపై గతంలో పార్లమెంట్ లో ప్రస్తావించానని, ప్రజా సంక్షేమం కోసమే తాను పార్టీ ఏర్పాటు చేశానని అన్నారు. ఎస్సీ - ఎస్టీలను ఒక్క తాటిపైకి తీసుకువస్తానని గీత అన్నారు. రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనన్నారు. అయితే, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఆమె టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగినా...ఆమె సొంత పార్టీ పెట్టడం విశేషం.