Begin typing your search above and press return to search.
ఎంపీ భర్తను హైదరాబాద్ లో కిడ్నాప్..విడుదల
By: Tupaki Desk | 31 March 2016 4:23 AM GMTఏపీ ఎంపీ కొత్తపల్లి గీత (అరకు) భర్త కిడ్నాప్ ఉదంతం సంచలంగా మారింది. బుధవారం రాత్రి ఆయన కిడ్నాప్ అయినట్లుగా మీడియా సంస్థల్లో బ్రేకింగ్ న్యూస్ పడటం.. ఆ తర్వాత ఆయన్ను కిడ్నాప్ చేసిన వాళ్లు విడిచిపెట్టినట్లుగా చెప్పటం లాంటివి హాట్ టాపిక్ గా మారాయి. ఎంపీనే స్వయంగా ఒక మీడియా ఛానల్ కు ఫోన్ చేసి.. తన భర్తను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కిడ్నాప్ చేశారనటం.. తమకు చెందిన రూ.75కోట్ల విలువైన భూమికి సంబంధించిన హక్కు పత్రాల్ని రాయించుకొని వదిలేశారంటూ ఆరోపిస్తున్నారు.
కాస్త గందరగోళంగా ఉన్న కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ ఉదంతంలోకి వెళితే.. బుధవారం సాయంత్రం సమయంలో ఎంపీ తన భర్తకు ఫోన్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఫోన్ అందుబాటులో లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన ఆమె.. కారు డ్రైవర్ కు ఫోన్ చేశారు.ఒక హోటల్ లో కొందరు వ్యక్తులు సార్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పటంతో ఎంపీ ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసి కిడ్నాప్ సమాచారం ఇవ్వటంతో పాటు.. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత తనను కిడ్నాప్ చేసిన వారు.. తనను వదిలేసినట్లుగా ఎంపీ భర్త చెబుతున్నారు. ఇదిలా ఉంటే తన భర్త కిడ్నాప్ ఉదంతం గురించి వివరాలు వెల్లడించిన అరకు ఎంపీ.. తమకు గచ్చిబౌలిలో రూ.75కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఉందని.. అభివృద్ధికి దాన్ని రామకృష్ణ.. సుధాకర్ రావులనే వ్యక్తులకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని.. నెలలు గడుస్తున్నా దాన్ని అభివృద్ధి చేయటం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ భూమి తమకు ఇవ్వాలంటే..తన భర్తను కిడ్నాప్ చేసి.. తమ భూమిపై యాజమాన్య హక్కుల్ని బలవంతంగా రాయించుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని పక్కన పెడితే.. మెదడులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్నఏమిటంటే.. ఎంపీ భర్త గారిని ఎవరో ఇద్దరు వ్యక్తులు హోటల్లో ఇబ్బంది పెడుతుంటే.. ఎంపీగారికి కారు డ్రైవర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వకపోవటం ఏమిటి? ఎంపీగారే స్వయంగా ఫోన్ చేశాక మాత్రమే కారు డ్రైవర్ విషయాన్ని చెప్పటం ఏమిటి..?