Begin typing your search above and press return to search.
ఆ జంపింగ్ ఎంపీకి కష్టాలు మొదలు
By: Tupaki Desk | 19 Sep 2016 1:30 PM GMTకొత్తపల్లి గీత....అరకు ఎంపీ. గెలిచింది వైసీపీ తరఫున కాగా...అనంతరం ఆమె టీడీపీలో చేరారు. అయితే ఇటీవలే ఆమెపై తీవ్రమైన భూకబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన స్థలాలున్న శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్ మక్తా సర్వే నంబర్ 83లో విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఆమె దొంగ పత్రాలు సృష్టించి, ఇవే పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రూ. 25 కోట్ల రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో ఆమెపై సీబీఐ కూడా విచారణ జరిపి అభియోగాలను కూడా నమోదు చేసింది. ప్రస్తుతం తనదిగా పేర్కొంటున్న భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని - ముఖ్యమంత్రి కేసీఆర్ ను గీత తీవ్రంగా విమర్శించారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ అక్రమాలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో అక్రమాలకు పాల్పడిందే కాకుండా ప్రభుత్వంపై తిరిగి విమర్శలు చేయడం ఏమిటని కేసీఆర్ విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గీత తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కలెక్టర్ రఘునందన్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పరిణామం తమ పార్టీలో కొనసాగుతున్న ఎంపీగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఇరకాటంలో పడేశాయని అంటున్నారు. అటు చంద్రబాబు హయాంలోనే కొత్తపల్లి గీత ఎంపీగా పనిచేయడం - పైగా ప్రస్తుతం పార్టీ మారి టీడీపీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఇది చంద్రబాబుకు పరువు సమస్యగా మారిందని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది.