Begin typing your search above and press return to search.

కొత్తపల్లి గీత.. కొత్తపార్టీ.. అంతా షాక్

By:  Tupaki Desk   |   23 Aug 2018 11:17 AM GMT
కొత్తపల్లి గీత.. కొత్తపార్టీ.. అంతా షాక్
X
ఫేమస్ నాయకులకే సాధ్యం కావడం లేదు.. అలాంటిది అరకు ఎంపీ కొత్త పల్లి గీత పార్టీ పెట్టి అధికారం కొల్లగొడుతుందట.. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో అంతా ఆడిపోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. గీత పార్టీ పెట్టడమే వండర్ అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది..

2014 ఎన్నికల్లో కొత్త పల్లి గీత వైసీపీ నుంచి అరకు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాతి కాలంలో వైసీపీ కి దూరంగా ఉన్నారు. మొదట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ బీజేపీ పంచన చేరారు. బీజేపీకి దగ్గరవుతుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాసింది.

తాజాగా బుధవారం కొత్తపల్లి గీత విలేకరులతో మాట్లాడారు. ఈ శుక్రవారం పార్టీని విజయవాడలో లాంఛనంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి స్వయంగా పోటీచేసి గెలిచే సత్తా ఉందంటూ ప్రకటించింది. సొంతపార్టీ పేరు, సిద్ధాంతాల గురించి మాత్రం పేర్కొనలేదు. నాగం, దేవందర్ గౌడ్, చిరంజీవి లాంటి తలపండిన వ్యక్తులతోనే కానిది గీతతో అవుతుందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.