Begin typing your search above and press return to search.

ఆఫ్ టిక్కెట్ సీఎంనని చెప్పుకొంటున్న కేజ్రీ

By:  Tupaki Desk   |   1 Jan 2016 9:02 AM GMT
ఆఫ్ టిక్కెట్ సీఎంనని చెప్పుకొంటున్న కేజ్రీ
X
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాధ మామూలుగా లేదు.. పేరుకు ముఖ్యమంత్రియినా సగం పెత్తనం కేంద్రం చేతిలో ఉండడంతో ఆయనకు చేతులు కట్టేసినట్లు ఉంటోంది. పైగా కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో నానా ఇబ్బంది పడిపోతున్నారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూనే సయోధ్యం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటల్లో తరచూ ఆ టోన్ వినిపిస్తోంది. తాజాగా కూడా ఆయన తన దుస్థితిపై తానే జోకులేసుకుంటూనే కేంద్రంతో విభేదాలు లేకపోతే చాలన్నట్లుగా మాట్లాడారు. సగం సైజు రాష్ట్రానికి తాను పావు సైజు ముఖ్యమంత్రినని.. అడ్డంకులు కల్పించకుండా తనను పని చేసుకోనిస్తే తమకూ కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇతర అస్త్రాలను తనపై సంధిస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. ఒకసారి ఎసిబి, మరొకసారి ఎసిబి అధినేత ముఖేష్‌ మీనా, మరొకసారి లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ లను తనపైకి ఉసిగొల్పుతున్నారని ఆయన చెప్పారు. తాజాగా ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారులందరూ మూకుమ్మడి సెలవుపై వెళ్లడం కేంద్రం కుట్రలో భాగమేనని ఆయన చెప్పారు.

అయితే... కేంద్రం సహకరించడం లేదని కేజ్రీ అంటున్నా ఆయన తీసుకున్న కొన్ని విధానాలను మాత్రం కేంద్రం భేష్ అంటోంది. ముఖ్యంగా కాలుష్య నియంత్రణకు ప్రవేశపెట్టిన సరి బేసి సంఖ్యల విధానానికి కేంద్రమంత్రులు కొందరు ఇప్పటికే బాహాటంగా మద్దతు పలికారు. మిగతా విషయాల్లో మాత్రం కేజ్రీకి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నా కేజ్రీ కూడా కేంద్రానికి పక్కలో బల్లెంలాగే వ్యవహరిస్తున్నారు.