Begin typing your search above and press return to search.

సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో కేజ్రీవాల్ మాట‌ల ఫైరింగ్‌

By:  Tupaki Desk   |   21 Jan 2016 9:20 AM GMT
సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో కేజ్రీవాల్ మాట‌ల ఫైరింగ్‌
X
సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌ డీ విద్యార్థి రోహిత్ ఆత్మ‌హ‌త్య ఉదంతం రోజురోజుకీ తీవ్ర‌రూపం దాలుస్తున్న వేళ‌.. జాతీయ స్థాయి నాయ‌కులు ప‌లువురు సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి వ‌స్తున్నారు. గురువారం ఉద‌యం ప‌లువురు ప్ర‌ముఖుల‌తోపాటు.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వ‌ర్సిటీకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రోహిత్ ఉదంతంపై విద్యార్థి నేత‌ల‌తో మాట్లాడిన ఆయ‌న అనంత‌రం ఆందోళ‌న చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు.

'జై భీమ్ - రోహిత్ అమర్ రహే - వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసి త‌న ప్ర‌సంగాన్ని కేజ్రీ షురూ చేశారు. బీజేపీ నేత‌ల‌పైనా.. మోడీ స‌ర్కారుపైనా నిప్పులు చెరిగారు. ఆందోళ‌న చేస్తున్న విద్యార్థి యూనియ‌న్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఏఎస్ ఏ విద్యార్థుల త‌ప్పు ఏ మాత్రం లేద‌ని తేల్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగంలోని అంశాలు చూస్తే..

= ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పైన ఏఎస్ ఏ విద్యార్థులు దాడి చేయలేదు.
= ఏబీవీపీ నేతల వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు.
= కేంద్రమంత్రి దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండానే విద్యార్థులకు వ్యతిరేకంగా లేఖ రాశారు.
= ఏఎస్ ఏ జాతి వ్యతిరేక సంస్థ కాదు.
= యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏఎస్ ఏ విద్యార్థుల తప్పులేదని చెప్పారు.
= రిజిస్ట్రార్ మాట‌ల్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు?
= కేంద్ర‌మంత్రి దత్తాత్రేయ లేఖతోనే విద్యార్థులను సస్పెండ్ చేశారు.
= హెచ్చార్డీ నుంచి వచ్చిన లేఖతో వీసీ మారిపోయారు. కొత్తగా వచ్చిన వీసీ విద్యార్థుల పైన చర్యలు తీసుకున్నారు.
= వీసీని స‌స్పెండ్ చేయాలి.
= ఏబీవీపీ.. ఆర్ ఎస్ ఎస్ వాళ్ల‌ను వ‌ర్సిటీల్లో వీసీలుగా బీజేపీ స‌ర్కారు పెడుతోంది.
= రోహిత్ తన మెరిట్‌తో యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్నాడు.
= రిజర్వేషన్లతో రోహిత్ యూనివర్సిటీకి రాలేదు.
= అలాంటి మెరిట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం.
= విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం మంచిది కాదు.
= ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఆపరేషన్‌ కు ఏఎస్ ఏ విద్యార్థులతో గొడవకు ఏమాత్రం సంబంధం లేదు.
= విశ్వవిద్యాలయాల్లో కులాల వారీగా చీలిక తెచ్చేందుకు ఏబీవీపీ ప్రయత్నాలు చేస్తోంది,
= స్మృతి ఇరానీ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి . ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఆమె చూసుకోవాలి.
= స్మృతి ఇరానీ ఈ వివాదాన్ని దళితులకు.. ఇతర వర్గాలకు మధ్య వివాదంగా చిత్రీకరించారు.
= ఈ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుదారి పట్టించినందుకు స్మృతి ఇరానీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.
= కేంద్ర‌మంత్రులు స్మృతి ఇరానీ.. బండారు ద‌త్తాత్రేయ‌ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించాలి.
= ప్ర‌ధాని మోడీ మీద దేశంలోని విద్యార్థులు ఆగ్ర‌హంగా ఉన్నారు.
= మోడీ విద్యార్థుల‌తో పెట్టుకోకుండా ఉండ‌టం మంచిది.
= రోహిత్ ఆత్మ‌హ‌త్య బాధితుల్ని వెంట‌నే అరెస్ట్ చేయాలి.
= కేంద్రం నుంచి వ‌చ్చిన లేఖ‌ల‌తో పాటు ఢిల్లీ నుంచి వ‌చ్చిన కాల్ రికార్డును బ‌య‌ట‌కు తీయాలి.
= ఈ ఘ‌ట‌న‌లో బాధ్య‌త ఉన్న వారంద‌రినీ అరెస్ట్ చేయాలి.