Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ ఫుల్లు హ్యాపీయేనా ?
By: Tupaki Desk | 8 March 2022 4:49 AM GMTఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫుల్లు హ్యాపీగానే ఉండుంటారు. ఎందుకంటే తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ లో అధికారం అందుకోబోయేది ఆప్ అని స్పష్టమైనందుకు. పంజాబ్ లో పాగా వేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. 2017లోనే గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో 20 సీట్లతో ప్రధాన ప్రతిపక్షం స్ధాయి వరకు పార్టీ ఎదిగింది. అప్పటినుండి చేస్తున్న నిర్విరామ కృషి వల్ల, కేజ్రవాల్ కున్న క్లీన్ ఇమేజి వల్ల తాజా ఎన్నికల్లో అధికారం అందుకనేందుకు మార్గం దొరికింది.
పంజాబ్ లోని 117 సీట్లలో ఆప్ క్లియర్ గా అధికారంలోకి వచ్చేస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. అయితే కొన్ని సర్వేల్లో మాత్రం బొటాబొటి మెజారిటితో అధికారంలో వస్తుందని తేలింది. ఏదేమైనా పంజాబ్ అధికారంలోకి రావటమైతే ఖాయమని తేలిపోయింది.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం+పార్టీలోని వివాదాలే. అలాగే బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేని స్థితిలో అవస్థలు పడుతోంది.
నిజానికి అధికార కాంగ్రెస్ పై చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలైతే లేవు. కాకపోతే పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ చేసిన కంపుతో జనాలకు కాంగ్రెస్ అంటేనే ఏవగింపు పెరిగిపోయింది. మంచి పట్టున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ను పదవిలో నుంచి దింపేంతవరకు సిద్ధూ నిద్రపోలేదు.
తర్వాత సీఎం అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీని కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తప్పనిసరై చన్నీతో చేతులు కలిపాడంతే.
ఇలాంటివన్నీ చూసిన తర్వాత జనాలకు కాంగ్రెస్ అంటేనే బాగా విసుగొచ్చేసింది. ఇదే సమయంలో గడచిన ఐదేళ్ళుగా ఆప్ ఎంఎల్ఏల పనితీరు, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉన్న క్లీన్ ఇమేజి జనాలను బాగా ఆకర్షించింది. పంజాబ్ లో కూడా ఢిల్లీ మోడల్ నే అమలు చేస్తానని కేజ్రీవాల్ పదే పదే తన ప్రచారంలో చెప్పారు.
దీనికితోడు మంచి ఎంపీగా పేరున్న భగవంత్ మాన్ సింగ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించటం కూడా పార్టీకి కలిసొచ్చింది. మొత్తానికి చాలాకాలం తర్వాత కేజ్రీవాల్ కల నెరవేరబోతోంది.