Begin typing your search above and press return to search.
ఫ్లాష్ న్యూస్ : ఢిల్లీ సరిహద్దులు వారం పాటు బంద్ !
By: Tupaki Desk | 1 Jun 2020 12:10 PM GMTవైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో వారం రోజులపాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. నిత్యవసరాలకు మాత్రం అవకాశం ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రజల నుంచే సూచనలు తీసుకుంటామని అన్నారు.
దీనికోసం 8800007722 వాట్సాప్ నంబర్, 1031 టోల్ ఫ్రీ నంబర్ కేటాయించామని, వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే 20,000 వైరస్ కేసులు నమోదయ్యాయి. 473 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఒక్క రోజులోనే 1000 కేసులు నమోదు కావడంతో సీఎం కేజ్రీవాల్ తాజా ఆదేశాలు జారీ చేశారు. వైరస్ పేషంట్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని... ప్రతి పేషంట్‌కు ఓ బెడ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
అసలు ఢిల్లీ ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్న దానిపై ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా స్పందిస్తూ ... ‘‘ఢిల్లీ ప్రజల కారణంగానే యూపీలో కరోనా విజృంభించింది అని సాక్షాత్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వారి అధికారులు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. హర్యానా కూడా అచ్చు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. సరిహద్దుల్లోని రోడ్లను కూడా తవ్వేశారు అని తెలిపారు. అయితే, వారు అలా ఆరోపించినందుకు తాము ఈ నిర్ణయం ఎంతమాత్రమూ తీసుకోలేదని, ప్రతీకారం తీర్చుకోవడం తమ విధానం ఎంతమాత్రమూ కాదని తేల్చి చెప్పారు. యూపీ ముఖ్యమంత్రికి, హర్యానా ముఖ్యమంత్రికి ఏవిధంగానైతే వారి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ ఉందో తమకూ అంతే శ్రద్ధ ఉందని, ఈ కోణంలోనే సరిహద్దులు మూసేయడం అన్న నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన వెల్లడించారు.