Begin typing your search above and press return to search.
మొన్న పెళ్లికి ముందు పుష్ప.. తాజాగా పెళ్లి తర్వాత అర్చన
By: Tupaki Desk | 26 April 2022 3:30 AM GMTసర్ ప్రైజ్ ఇస్తానంటూ షాపింగ్ కు తీసుకెళ్లి.. ఆపై గుడి దగ్గర కాబోయే భర్త కళ్లకు గంతలు కట్టిన పుష్ప.. గొంతు కోయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. ఎందుకింత పాడు పని చేశావంటే.. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని.. అధ్యాత్మిక మార్గంలో వెళతానంటే తల్లిదండ్రులు వద్దనటంతో ఇలా చేసినట్లుగా చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.మొన్న పుష్ప చేసినట్లే తాజాగా హనుమకొండ జిల్లాకు చెందిన అర్చన.. భర్త గొంతును కోసిన దారుణ ఉదంతం వెలుగు చూసింది.
పెళ్లై పట్టుమని నెల కూడా కాక ముందే ఇలా చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. పసరగొండ గ్రామానికి చెందిన రాజుకు అర్చనకు గత నెల 25న పెళ్లైంది.
ఎప్పటిలానే ఆదివారం రాత్రి పడుకున్న తర్వాత.. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో భర్త గాఢ నిద్రలో ఉన్న వేళలో.. భార్య అర్చన బ్లేడ్ తీసుకొని గొంతు కోసేసింది.
తీవ్రమైన నొప్పితో మెలుకువ వచ్చిన రాజు కేకలు వేయటం.. ఆ వెంటనే కుటుంబ సభ్యులు స్పందించటంతో అతడ్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గడిచిన కొద్ది రోజులుగా అర్చన వింతగా ప్రవర్తిస్తుందని చెబుతున్నారు.
పెళ్లికి ముందే.. కాబోయే మొగుడు గొంతు కోసిన పుష్ప తీరు ఇప్పటికే అర్థం కానిదిగా మారితే.. ఇప్పుడు పెళ్లై సరిగ్గా నెలకు.. ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరించిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ రెండు ఉదంతాలతో భార్యభర్తల బంధానికి సంబంధించి సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పుదు. ఇంతకీ ఇంత దారుణంగా అర్చన ఎందుకు వ్యవహరించిందన్నది తేలాల్సి ఉంది.