Begin typing your search above and press return to search.
ఎవరీ బికినీ గర్ల్.. ఆమెను నిజంగానే అంతలా ట్రోల్ చేయాలా?
By: Tupaki Desk | 17 Jan 2022 10:22 AM GMTయూపీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వేళ.. అందులోని ఒక పేరు పైన బిజేపీ. వారి అనుబంధ సంఘాలు.. హిందూ సంఘాల పేరుతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా వారి నోటి నుంచి తరచుగా బికినీ గర్ల్ అన్న మాట వినిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన 125 అభ్యర్థుల జాబితాలో ఒకరైన అర్చన గౌతమ్ ను టార్గెట్ చేసుకున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
మీరట్ లోని హస్తినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మోడల్ గా.. సినీ నటిగా సుపరిచితురాలైన ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే.. చిట్టిపొట్టి బట్టలు వేసుకొన్న ఆమె అభ్యర్థి ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. బికినీ గర్ల్ గా ఆమెను పలువురు పిలుస్తుంటారు. దీనికి కారణం 2018లో జరిగిన అందాల పోటీలో మిస్ బికినీ ఇండియాగా విజేతగా నిలిచారు. అప్పటి నుంచి ఆమె పేరు బికినీ గర్ల్ గా పాపులర్ అయ్యింది.
1995 సెప్టెంబరులో మీరట్ లోని పార్తాపూర్ లో పుట్టిన అర్చన.. మీరట్ లోని ఐఐఎంటీ కాలేజీలో మాస్ కమ్యునికేషన్స్ పూర్తి చేశారు. యాక్టింగ్.. మోడలింగ్ రంగాన్ని తన ప్రొఫెషన్ గా ఎంచుకున్న ఆమె.. చదువు అయ్యాక ముంబయి వెళ్లారు. అనంతరం ఆమె పలు టీవీ సీరియల్స్ తో పాటు యాడ్స్ లోనూ నటించారు. 2015లో గ్రాండ్ మస్తీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత కొన్నిసినిమాలు చేసినా..చాలామంది మాదిరి పేరు ప్రఖ్యాతులు పెద్దగా వచ్చింది లేదు.
తాను ఉండేది గ్లామర్ ప్రపంచంలో కావటంతో.. కొన్ని బోల్డ్ ఫోటోల్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేవారు. ఇన్ స్టా రీల్స్ లోనూయాక్టివ్ గా పోస్టులు చేస్తుంటారు. ఆమె షేర్ చేసే ఫోటోలకు.. వీడియోలకు.. పోస్టులకు భారీగా లైకులు.. కామెంట్లు వస్తుంటాయి. గత ఏడాది నవంబరులో కాంగ్రెస్ లో చేరిన ఆమెకు.. తాజాగా అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇవ్వటంతో బీజేపీ.. హిందూ సంస్థలకుసంబంధించిన వారు ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు.
అయితే.. తన ప్రొఫెషన్ ను.. రాజకీయాల్ని కలపొద్దని.. రెండింటికి సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. కానీ.. ఆమె ప్రత్యర్థులు మాత్రం.. ఆమెను బికినీ గర్ల్ అంటూ టార్గెట్ చేస్తూ.. ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ గా.. 2018లో మిస్ బికినీ గా విజేతను అయ్యానని.. సినిమాను.. రాజకీయాన్ని కలపొద్దని కోరుతున్నారు.
గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ.. నియోజకవర్గసమస్యల విషయంలో ఆమె తన విజన్ ను స్పష్టంగా వెల్లడిస్తున్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే.. తన ప్రధాన దృష్టి అభివృద్ధి పనులపైనే ఉంటుందని చెబుతున్నారు. తాను బరిలోకి దిగుతున్న హస్తినాపురం గురించి చెబుతూ.. ఈ ప్రదేశం మంచి పేరున్న పర్యాటక ప్రాంతమని.. పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయని.. వాటికి కనెక్టివిటీ సమస్య కారణంగా పర్యాటకులు రాలేకపోతున్నట్లు చెప్పారు.
తాను ఎమ్మెల్యే అయితే.. బస్టాండ్ ను.. రైల్వేస్టేషన్ ను నిర్మించటమే తన మొదటి ప్రాధాన్యతగా చెబుతున్నారు. టూరిజం పెరిగితే.. హస్తినా పురానికి ఎక్కువ మంది టూరిస్టు వస్తారని.. అదే జరిగితే.. ప్రజలకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ గ్లామర్ ఫీల్డే అయినా.. ఆమె మాటలు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీదా.. నియోజకవర్గంలోని ఇష్యూల మీద స్పష్టంగా మాట్లాడుతున్న ఆమెపై బీజేపీ నేతలు కత్తి కట్టటం వ్యూహాత్మకంగా చెబుతున్నారు. మరి.. హస్తినాపురం వాసులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.