Begin typing your search above and press return to search.

లక్ష ఏళ్ల తర్వాత ఆర్కిటిక్ లో తొలిసారి..

By:  Tupaki Desk   |   6 Jun 2016 6:14 AM GMT
లక్ష ఏళ్ల తర్వాత ఆర్కిటిక్ లో తొలిసారి..
X
మనిషి చేసిన పాపం అంతాఇంతా కాదు. అన్ని ఇచ్చిన ప్రకృతికి తన అహంకారంతో.. తన స్వార్థం కోసం పర్యావరణ సమతుల్యాన్ని ఎంతగా నాశనం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాపానికి ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటున్న మనిషి.. మరింత మూల్యాన్ని చెల్లించుకోవటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తం మంచు దుప్పటితో కప్పుకొని ఉండే ఆర్కిటిక్ సముద్రం లక్ష సంవత్సరాల తర్వాత తొలిసారి.. ఒక దారుణమైన పరిణమం చోటుచేసుకోనుంది.

గత 30 ఏళ్లుగా 1.27కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంచు ఈ ఏడాది 1.11 లక్షల చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయిందన్న కఠిన వాస్తవం తాజాగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ కరిగిపోయిన మంచు ఎంతంటే.. బ్రిటన్ పరిణామం కంటే ఆరు రెట్లు పెద్దది. ఎంత భారీ విస్తీర్ణంలో మంచు మాయమైందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా వెల్లడైన అంశాల్ని చూస్తే గతంలో తాము ఊహించినట్లే జరుగుతుందని.. ఈ ఏడాది ఆర్కిటిక్ మంచు కనుమరుగు కానుందని కేంబ్రిడ్జ్ వర్సిటీ శాస్త్రవేత్త పీటర్ వాథామ్స్ అంచనా వేస్తున్నారు. ఆర్కిటిక్ మంచు పూర్తిగా కనుమరుగైతే.. సముద్ర మట్టాలు పెరుగుతాయన్న ఆందోళన ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. మనిషి చేసిన తప్పులకు చివరకు అదే మనిషి బాధితుడు కావటం తెలిసిందే అయినా..తాను చేసిన ప్రకృతి వినాశనానికి ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నది భవిష్యత్ పరిణామాలు చెప్పనున్నాయన్న మాట.