Begin typing your search above and press return to search.
12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నారా?
By: Tupaki Desk | 12 Dec 2022 9:37 AM GMTతెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ , కాంగ్రెస్ కు మాత్రమే 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో నేతల బలం.. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. ఇక బీజేపీకి కేవలం 40 నుంచి 50 నియోజకవర్గాల్లో మాత్రమే క్యాడర్, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అందుకే టీఆర్ఎస్ ఓడిపోతే వస్తే గిస్తే కాంగ్రెస్ నే అధికారంలోకి రావాలి. కానీ కాంగ్రెస్ నేతలను లాగేసి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది.
కానీ కాంగ్రెస్ నుంచి ఎంతమంది సీనియర్లు పోయినా కూడా అక్కడ ద్వితీయ శ్రేణి నాయకుల సంఖ్య బలంగా ఉంది. వారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా భర్తీ కాగలరు. పైగా యువ కాంగ్రెస్ నేతలు ఉడుకు మీదున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయ్యాక సీనియర్లకు ప్రాధాన్యం తగ్గి జూనియర్లకు పెరిగింది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి , వి.హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారిని పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే అందరూ సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.
రేవంత్ రెడ్డి పక్కాగా స్కెచ్ గీస్తూ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే ఎత్తుగడ వేస్తున్నారు. ఈ మేరకు ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందర పాదయాత్ర చేయడంతోపాటు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్టు సమాచారం.
టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న 12 మంది అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల ముందర ఈ 12 మంది రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని.. ప్రస్తుతం వీరందరికీ గాలం వేసి ఉంచాడని టాక్ నడుస్తోంది. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ నుంచి దాదాపు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి రేవంత్ రెడ్డి ఒప్పించాడని సమాచారం. వాళ్లందరికీ నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉందట.. టీఆర్ఎస్ లో మరో నేతలు పోటీగా ఉన్నారట..
వచ్చేసారి కేసీఆర్ టికెట్ ఇస్తాడో లేడోనన్న భయం వెంటాడుతోంది. ఇక టీఆర్ఎస్ పై రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత కూడా తమ ఓటమికి దారితీస్తుందని ఆ 12 మంది కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు రేవంత్ ను సంప్రదించారని.. ఎన్నికల ముందర చేర్చుకునేందుకు సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.