Begin typing your search above and press return to search.
ఇక తెలంగాణలో అన్ని జాతీయ పార్టీలేనా?
By: Tupaki Desk | 3 Oct 2022 3:44 AM GMTతెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు జాతీయ పార్టీలుగా మారతాయని చెబుతున్నారు.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు జాతీయ పార్టీ గుర్తింపు ఉంది. ఇక టీడీపీకి జాతీయ పార్టీ గుర్తింపు లేకపోయినా జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో ఇప్పుడు కేసీఆర్ కూడా టీఆర్‌ఎస్‌కు బదులుగా బీఆర్‌ఎస్‌ను తెరమీదకు తెస్తున్న నేపథ్యంలో అది కూడా అన ధికారికంగా జాతీయ పార్టీగా మారనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగనుందని అంటున్నారు.
బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఒకప్పుడు బీఎస్పీకి జాతీయ పార్టీ హోదా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వివిధ రాష్ట్రాల్లో నిరాశజనకమైన ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ హోదాను పోగొట్టుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాల్సి ఉంది.
తెలంగాణలో మొదట్లో కొన్ని జిల్లాలకే మాత్రమే పరిమితమైన పార్టీగా టీఆర్‌ఎస్ ఉండేది. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఆ పార్టీ అంత బలంగా ఉండేది కాదు. అయితే గత ఎన్నికల నాటికి ఈ జిల్లాల్లోనూ మెరుగైన స్థానాలు సాధించి రాష్ట్ర పార్టీగా టీఆర్‌ఎస్ ఎదిగింది. ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించబోతోంది. కొత్త పేరు, కొత్త అజెండాతో ముందుకు రానుంది. ఈ పరిణామంతో తెలంగాణలో ఒక్క వైఎస్సార్ తెలంగాణ పార్టీ మినహాయించి ఇక దాదాపుగా అన్ని పార్టీలూ జాతీయ పార్టీలే కానున్నాయి.
జాతీయ పార్టీగా ఎవరైనా తన పార్టీని ప్రకటించుకున్నా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా జాతీయ పార్టీగా గుర్తించాలంటే మాత్రం నిర్దేశిత ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఒక రిజిస్టర్డ్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు మూడు మార్గాలున్నాయని చెబుతున్నారు. ఇందులో ఒకటి.. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లను సాధించాలి. అంతేకాకుండా నాలుగు ఎంపీ సీట్లను కూడా గెలవాలి.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే సాధించాల్సిన రెండో ప్రమాణం... దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించాలి. ఈ రెండు శాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి.
ఇక జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే సాధించాల్సిన మూడో ప్రమాణం... ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండడం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడో నిబంధన ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది.
ఇక రాష్ట్రంలో పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి. లేకుంటే ఆరుశాతం ఓట్లు తెచ్చుకోవడంతో పాటు ఒక ఎంపీ సీటు సాధించాల్సి ఉంటుంది.
అయితే జాతీయ పార్టీగా గుర్తింపు పొందితే పలు ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒకే గుర్తుతో పోటీ చేయొచ్చు. అంతేకాకుండా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దూరదర్శన్, ఆలిండియా రేడియోలలో ఉచితంగా ప్రచారానికి అవకాశమిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ రేటుకు భూమిని ఇస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.