Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్ కొంప ముంచాయా?
By: Tupaki Desk | 8 March 2022 6:29 AM GMTకేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఒంటికాలితో లేస్తున్న కేసీఆర్ ముందరికాళ్లకు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బంధం వేస్తున్నాయి. ఢిల్లీ గద్దెనెక్కి .. మోడీని దించి ప్రధాని అవుదామని కలలుగంటున్న కేసీఆర్ కు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శరాఘాతంగా మారాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మరింతగా విమర్శలకు పదును పెట్టి చెలరేగిపోదామనుకున్న కేసీఆర్ కు ఈ అంచనాలు మింగుడుపడడం లేదు. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు గులాబీ బాస్ కు నిద్రలేకుండా చేస్తున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇక యూపీనే కాదు.. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కూడా బీజేపీకే అవకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చడంతో కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డట్టు అయ్యింది. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో కేంద్రంతో ఫైట్ కు దిగి బీజేపీని ఓడిస్తానన్న కేసీఆర్ శపథాలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ తో కేసీఆర్ ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీజేపీ వ్యతిరేకులను, వ్యతిరేక పార్టీలను గాటిన కట్టాలని చూస్తున్న కేసీఆర్ ఇటీవల పలురాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్ తోనూ కలిసి కేంద్రంలో అధికారం కోసం చూస్తున్నారు. ఇప్పుడు అవన్నీ నెరవేరని తేలిపోయింది. కేసీఆర్ కు ఫ్రంట్ పెట్టేంత సీన్ లేదని.. కాంగ్రెస్ తోనూ కలిస్తే పుట్టి మునగడం ఖాయం అని అర్థమైందంటున్నారు.
బీజేపీ ఓడిపోతేనే కేసీఆర్ కు చాన్స్.. బీజేపీని ఓడిస్తేనే కేసీఆర్ జాతీయ నేతగా నిలబడగలరు. కానీ అది చేయకుండా పీఎం పోస్టురావడం కష్టం. కానీ ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాన్ని చేసి చూపించారు. పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించి అధికారం చేపట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. దీంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితం అయితే కేజ్రీవాల్ మాత్రం తన పార్టీని దేశంలోని ఐదారు రాష్ట్రాల్లో గెలిపించి జాతీయ పార్టీగా రూపుదిద్దుతున్నారు. ఇక మోడీ తర్వాత దేశ ప్రధానిగా మమతా బెనర్జీని అనుకుంటున్నారు. అయితే బెంగాల్ లోనూ ఆప్ పార్టీ పలు సీట్లు గెలిచింది. 2024లో మిగతా రాష్ట్రాల్లోనూ ఆప్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి వ్యతరేక పార్టీగా ఆప్ నిలబడుతుంది. కేజ్రీవాల్ కు మోడీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలు ఉంటాయి.
కేసీఆర్ కు ప్రస్తుతం మిగతా రాష్ట్రాల్లో గెలిచేంత బలం లేదు. పోటీచేయడం కష్టం. పార్టీని విస్తరించలేదు. అదే కేజ్రీవాల్ ఇప్పటికే ఈ విషయంలో ముందుకున్నాడు. బీజేపీ వ్యతిరేకులంతా కలిసినా ప్రధానిగా కేజ్రీవాల్ కే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. కేసీఆర్ ముందుకెళ్లడం కష్టమే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు ఇదే స్పష్టమైంది.