Begin typing your search above and press return to search.
రైతులు పాకిస్థానీలా? మోదీ తీరు అత్యంత దారుణం..
By: Tupaki Desk | 26 Jan 2021 2:30 AM GMTవివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం పట్ల కేంద్రం చూపుతున్న వైఖరి పట్ల నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ హక్కులకోసం ఉద్యమిస్తున్న రైతులు పాకిస్థానీయులా? పంజాబ్ పాకిస్తాన్‌లో ఉందా? అని శరద్ పవార్ ఘాటుగా ప్రశ్నించారు. ఢిల్లీలో సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబైలో చేపట్టిన రైతు ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆయన మాట్లాడారు.
ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన శరద్‌పవార్.. ప్రధానమంత్రి నరంద్రమోదీ తీరును తప్పుపట్టారు. అంతేకాకుండా.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీపైనా విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు అలాంటి గవర్నర్‌ను చూడలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. రైతు ఉద్యమకారులు గవర్నర్‌ను కలవాలన్న ప్రణాళికపై శరద్‌పవార్ స్పందిస్తూ.. గవర్నర్‌కు కంగనా (బాలీవుడ్ హీరోయిన్) ను కలిసే ససమయం ఉంది కానీ, రైతులను కలిసే టైం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను కలవడం గవర్నర్ కనీస నైతిక బాధ్యత అని అన్నారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలామంది రైతులు ఎముకలు కొరికే చలిలో కూడా ఆందోళన కొనసాగిస్తున్నారని పవార్ అన్నారు. చలి, ఎండ, వర్షం లాంటి పరిస్థితులకు వెరవకుండా ఈ ఆందోళనల్లో అన్నదాతలు పాల్గొంటున్నారని పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా.. నరేంద్రమోదీ రైతుల ఆందోళన గురించి కనీసం ఆరా తీయక పోవడాన్ని తప్పుపట్టారు.