Begin typing your search above and press return to search.
లగ్జరీ ఇళ్ల కోసం భారతీయులు ఎగబడుతున్నారా? ఎవరు చెప్పారంటే?
By: Tupaki Desk | 26 Aug 2022 4:30 PM GMTఆసక్తికర అంశాన్ని వెల్లడించిందో నివేదిక. దేశీయంగా ప్రజల ఇంటి కొనుగోలు విషయంలో వచ్చిన మార్పును స్పష్టంగా.. కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చిందో సంస్థ. కొవిడ్ కు ముందు ఒకలా.. కొవిడ్ తర్వాత మరోలా అన్న మాటలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మార్పులు చోటు చేసుకున్న విషయాన్ని చెబుతున్నారు.
కొవిడ్ 19 తర్వాత ఇళ్ల కొనుగోలులో స్పష్టమైన మార్పుల గురించి చెప్పింది రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ గ్రూప్. తాజాగా దీనికి సంబంధించిన నివేదికను వెల్లడించింది.
భారతీయులు విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి- మార్చి) లో దేశంలోని మొదటి ఏడు నగరాల్లో 1.84 ఇళ్లను అమ్మగా.. అందులో 14 శాతం లగ్జరీ ఇళ్లే ఉన్నట్లుగా పేర్కొన్నారు. అదే 2019 అంటే.. కొవిడ్ కు ముందే.. మొత్తం అమ్మిన 2.61 యూనిట్లు అయితే.. అందులో 7 శాతం మాత్రమే లగ్జరీ కేటగిరిలో ఉన్నాయని పేర్కొన్నారు.
అదే సమయంలో బడ్జెట్ ఇళ్ల అమ్మకాల్లో వాటా పడిపోయిన విషయాన్ని వెల్లడించింది. రూ.40 లక్షల లోపు ఇంటిని కొనుగోలు చేసే విషయంలో వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. 2019లో 38 శాతం అమ్మకాలు మొత్తం సేల్స్ లో ఉంటే 2022 నాటికి ఇది కాస్తా 31 శాతానికి పడిపోయినట్లుగా చెబుతున్నారు.
దీనికి కారణం కొవిడ్ పరిస్థితులతో పాటు.. ఆర్థిక పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పులే అని చెబుతున్నారు. కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చినా.. ఇళ్లను కొనుగోలు చేయటానికి మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా చూస్తే.. సంపన్నులు మరింత సంపదను పోగేసి.. లగ్జరీ ఇళ్ల కొనుగోలు విషయంలో దూసుకెళుతుంటే.. బడ్జెట్ జీవులు మాత్రం కొవిడ్ కష్టాలతో తల్లడిల్లుతూ.. తమ సొంతింటి కలను కాస్తంత వాయిదా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.