Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు షాక్.. కోమటిరెడ్డి రైట్ హ్యాండ్ జంప్
By: Tupaki Desk | 8 March 2019 6:55 AM GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలుకుంటున్న తరుణంలోనే...కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ గుర్తుపై గెలిచిన నేతలే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యే రేగ కాంతారావులు పార్టీకి గుడ్ బై చెప్పి ‘కారు’ ఎక్కడానికి రెడీ అయిపోయారు. ఈ జాబితాలోనే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సన్నిహితుడు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేరారు. తాజాగా ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అండతో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం ఆయన తమ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ లో చేరాలని డిసైడైన లింగయ్య ఈ మేరకు సీఎం కేసీఆర్‌ని కలిసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చేరిక ఉంటుందని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, చిరుమర్తి లింగయ్య టీఆర్ ఎస్ లో చేరితే కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత ఎదురుదెబ్బ తగిలినట్లేనని పలువరు భావిస్తున్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడు అయిన లింగయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బ్రదర్స్ ను మానసికంగా దెబ్బకొట్టడంలో కేసీఆర్ సఫలీకృతులు అయినట్లే అని పేర్కొంటున్నారు. లింగయ్య టీఆర్ ఎస్ లో చేరకుండా కోమటిరెడ్డి బద్రర్స్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆపుతారా వేచి ఛూడాలి.