Begin typing your search above and press return to search.

అమ్మాయిల విషయంలో మన కుర్రాళ్లు ఇంత వీకా?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:11 AM GMT
అమ్మాయిల విషయంలో మన కుర్రాళ్లు ఇంత వీకా?
X
యువతీ యువకులు డేటింగ్ అంటే లంచ్, డిన్నర్, రాత్రి మత్తు అయిన డ్రింక్స్ చేసి లాంగ్ డ్రైవ్ లేదా ఏకాంతమైన ప్రదేశంలో వాలిపోతారు. డేటింగ్ మొదటి రోజే శృంగారంలో పాల్గొనేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తద్వారా తమ బంధాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తారు. పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ లు, విడిపోవడాలు కామన్. భారతదేశంలో ఇప్పుడిప్పుడే అది ఊపందుకుంటోంది.

దేశంలోని యువకులు డేటింగ్ సమయంలో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారో తెలుసుకునేందుకు డేటింగ్ యాప్ 'టిండర్' ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ కుచెందిన యువకుల గురించి ఓ ఆసక్తికర అంశం తెలిసింది.

హైదరాబాద్ కు చెందిన యువకుల్లో 10లో ఆరుగురు అమ్మాయిని డేటింగ్ కు ఎలా పిలవాలి? ఒకవేళ వెళ్లినా.. ఎలా మాట్లాడాలని.. రోమాంటిక్ అంశాలను ఎలా అడగాలో తెలియదని సర్వేలో వెల్లడైంది.

వీడియో డేటింగ్లలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలు ఉన్నాయి. పికినిక్ ఇన్ పార్క్, వర్చువల్ మూవీ నైట్, సైక్లింగ్, పొట్టేరి అంశాలపై ఎక్కువమంది ఆసక్తి కనబరిచారు.

విదేశీయులు డేటింగ్ సంస్కృతిలో స్థాయి బేధాలను పట్టించుకోరు. ఆ మనస్తత్వం, ప్రవర్తనలు ఇక్కడ చాలా మందిలో ఉండడం లేదు. కొందరు యువకులు.. యువతులతో సమయం కేటాయించడంలో తడబడుతున్నారని తేలింది.

డేటింగ్ లో తొలి రోజే శృంగారంలో పాల్గొనడానికి ఈ యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జంటలు దీర్ఘకాలం కలిసి ఉండాలంటే తప్పకుండా చక్కటి శృంగార జీవితం ఉండాల్సిందేనని భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.