Begin typing your search above and press return to search.

యూపీలో మతపరంగా ఓట్లు చీలిపోయాయా ?

By:  Tupaki Desk   |   13 March 2022 1:30 PM GMT
యూపీలో మతపరంగా ఓట్లు చీలిపోయాయా ?
X
ఉత్తరప్రదేశ్ లో ఓట్లు మతపరంగా చీలిపోయాయా ? అవుననే చెబుతోంది తాజాగా వెల్లడైన ఒక నివేదిక. తాజాగా వెల్లడైన ఫలితాల నేపధ్యంలో సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ నేషన్ అనే సంస్ధ లోక్ నీతి అనే సంస్ధతో కలిసి పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చిన వివరాలు కాస్త ఆశ్చర్యంగాను, ఆందోళనగాను ఉంది. అదేమిటంటే పార్టీలకు పడిన ఓట్లు డెవలప్మెంట్ ఆధారంగా కాకుండా మతపరంగా, కులపరంగా చీలిపోవటమే.

పోలైన ఓట్లలో అత్యధికం హిందు-ముస్లిం ఓట్లుగా చీలిపోయాయి. బీజేపీకి 54 శాతం హిందువుల ఓట్లు పోలయ్యాయి. అలాగే ముస్లిం ఓట్లలో 80 శాతం సమాజ్ వాదీపార్టీకి పడ్డాయి. విచిత్రమేమిటంటే హిందువుల ఓట్లు ఎస్పీకి కాస్త పెరిగితే, ముస్లిం ఓట్లు బీజేపీ కొద్దగా పెరిగాయి. 2017 ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ముస్లిం ఓట్లు కాస్త పెరిగాయి. 2017లో బీజేపీకి ముస్లిం ఓట్లు 5 శాతం పడగా ఇపుడు 8 శాతం పోలయ్యాయి.

అలాగే హిందువులు+ముస్లింల ఓట్లు ఇపుడు ఎస్పీకి పెరిగాయి. 2017లో ముస్లిం ఓట్లు ఎస్పీకి 46 శాతం మాత్రమే పడితే ఇపుడు 80 శాతానికి పెరిగింది. అలాగే 2017లో ఎస్పీకి హిందువుల ఓట్లు 18 శాతం పోలయ్యాయి.

అలాంటిది తాజా ఎన్నికల్లో 26 శాతం పోలయ్యాయి. బీజేపీ కేటమి నుండి గెలిచిన 273 మంది ఎంఎల్ఏల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా లేరు. బీజేపీ కనీసం ఒక్కరికి కూడా ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేదు. దీంతోనే కమలంపార్టీ హిందుత్వ వాదాన్ని జనాల్లోకి ఎంతబలంగా తీసుకెళుతోందో అర్ధమైపోతోంది.

ప్రచారం సమయంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ హిందుత్వ వాదాన్ని పదే పదే బలంగా జనాల్లో వినిపించారు. హిందువులైన ప్రతిఒక్కళ్ళు బీజేపీకే ఓట్లేయాలంటు తన ర్యాలు, రోడ్డుషోల్లో చాలాసార్లు చెప్పారు. జనాలను మతాలపేరుతో రెచ్చగొట్టడం నిజానికి దీర్ఘకాలంలో చాలా దుష్పలితాలు చూపిస్తాయి. కానీ మన పాలకులకు అంతటి దీర్ఘదృష్టి ఎక్కడుంది. అందుకనే తాత్కాలిక విజయాల కోసం జనాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు.