Begin typing your search above and press return to search.
ఆ టీడీపీ ఎంపీలను లైన్లో పెట్టిన బీజేపీ
By: Tupaki Desk | 14 Jun 2019 11:30 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు రాజకీయ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుదామని కలలుగన్న నేత..కనీసం ఏపీలో కూడా ఏమీ తిప్పలేని పరిస్థితిని ప్రజలు కల్పించారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీలో చూపిన దూకుడు చూసి టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నైరాశ్యంలో కూరుకుపోయారు. తాను ద్వారాలు తెరిస్తే నీ టీడీపీ దుకాణం ఖాళీ అవుతుందని ఇప్పటికే జగన్ హెచ్చరికలు పంపారు.
ఇక ఎన్నికలతో దెబ్బతిన్న టీడీపీని మరింత దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ అధిష్టానం కూడా రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీ రాజ్యసభ ఎంపీలకు గాలం వేసినట్టు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలున్నారు. వారిని బీజేపీలోకి లాగాలని కేంద్రంలోని పెద్దలు స్కెచ్ గీశారని సమాచారం.
ముఖ్యంగా రాజ్యసభ ఎంపీల్లో సీఎం రమేష్, సుజనా చౌదరిలు చంద్రబాబుకు లెఫ్ట్ అండ్ రైట్ గా వ్యవహరిస్తూ ఆర్థిక అండదండలు అందిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఐటీ, ఈడీ దాడులతో చంద్రబాబును బీజేపీ పెద్దలు దెబ్బకొట్టారు. ఇప్పుడు వ్యాపార కోణంలో వారిని బెదిరించి బీజేపీలోకి లాగాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. తమకు మంచి ప్యాకేజీ ఇచ్చి ఈ కేసుల బాధలు తప్పిస్తే సదురు ఎంపీలు బీజేపీ వైపు దృష్టి సారించే అవకాశాలుంటాయి.
ఇక కేశినేని నానిపై కూడా బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు ఆయనను విస్మరించడంతో కొద్దిరోజులుగా బాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఆయనను కూడా లాగేయాలని బీజేపీ యోచిస్తోంది. ఎంత మంది వస్తే అంతమంది టీడీపీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలను లాగేసి టీడీపీని చావుదెబ్బ తీయడానికి బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముగ్గురిని లైన్లో పెట్టినట్టు సమాచారం.