Begin typing your search above and press return to search.
దాడులు వారిపైనే, కేసులు కూడా వారిపైనేనా?: బండి సంజయ్
By: Tupaki Desk | 15 March 2021 3:39 PM GMTభైంసాలో దాడులు జరిగింది హిందువులపైనే అని, కేసులు కూడా వారిమీదనే పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తోందని అన్నారు. భైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పోలీసులు ఎంఐఎం చెప్పుచేతల్లో ఉన్నారని ఆరోపించారు.
కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్. మానవత్వం లేని మృగం కేసీఆర్ అంటూ మండిపడ్డారు. పసిపాప మీద అత్యాచారం జరిగే ఎవరూ స్పందించట్లేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అత్యాచారాలు జరిగే మాట్లాడేవారు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు కూడా ఓ కుటుంబం ఉందన్న బండి.. వారికి కూడా ఇలాగే జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు.
ప్రగతి భవన్ లో తమ పార్టీ కార్యకర్తలతోపాటు తాను కూడా చొరబడతానని, సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొచ్చి, నిలదీస్తామని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే, గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు.
కాగా.. భైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి ఇదేరీతిన గొడవలు జరిగాయి. మళ్లీ తాజాగా పునరావృతం అయ్యాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. వారిని బీజేపీ నేతలు పరామర్శించారు.