Begin typing your search above and press return to search.
బీజేపీ సిద్ధాంతాలు వదిలేసినట్టేనా...?
By: Tupaki Desk | 19 Dec 2021 7:22 AM GMTరాష్ట్ర బీజేపీ కూడా తన సిద్ధాంతాలను వదిలేసిందా ? ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కిందా ? ముఖ్యంగా గత ఎన్నికలకుముందు.. అంతకు ముందు కూడా.. బీజేపీ ఎంచుకున్న సిద్ధాంతాన్ని పక్క న పెట్టిందా? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆది నుంచి కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని.. బీజేపీ.. నేతలు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలనూ.. పేర్కొన్నారు. ఇక, ఏపీ సీఎం జగన్.. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని.. ప్రకటించగానే.. ఇది మా హామీనేనని బీజేపీ నేతలు ప్రకటించారు.
దీంతో బీజేపీకి సీమలో ఒకింత ఫాలోయింగ్ పెరిగింది. అనంతపురం.. కర్నూలు.. వంటి చోట్ల నాయకుల సంఖ్యకూడా ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అంతేకాదు.. సోము వీర్రాజు సహా ఇతర కీలక నేతలు వెళ్లినప్పుడు.. అక్కడ ప్రజల నుంచి కూడా ఘన స్వాగతాలు లభించాయి. దీంతో నేతలకు కూడా ఇక్కడ రాజకీయాలు కలిసివస్తున్నాయనే ఆశలు పెరిగాయి.
ఇలా.. కొంత మార్పు వస్తోంది కదా.. అనుకుంటున్న సమయంలో.. హఠాత్తుగా.. ఇప్పుడు.. రాయలసీమ బీజేపీలో సంచలన కుదుపు చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం.. తాజాగా తిరుపతిలో జరిగిన రాజధాని రైతుల సభలో బీజేపీ నాయకులు ప్రత్యక్షం కావడ మే. తాము అమరావతికి అనుకూలమని.. వికేంద్రీకరణ అంటే.. మూడు రాజధానులు కాదని.. కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్నూలులో హైకోర్టుకు.. ఇక, బీజేపీ వ్యతిరేకమనే భావన సర్వత్రా వ్యక్తమైంది.
నిజానికి ఈ విషయాన్ని చెప్పే.. తాము ఇక్కడ డెవలప్ అవుతున్నామని.. ఇప్పుడు.. దీనిని కాదంటే.. ఎలా ముందుకు వెళ్లాలని.. బీజేపీ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. మన సిద్ధాంతాలను.. మన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను మనమే మరిచిపోతున్నామా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో.. దీనిని బట్టి సీమలోనూ.. బీజేపీ పాయే! అనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.