Begin typing your search above and press return to search.

ఆ సీఎం మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రకటిస్తారా?

By:  Tupaki Desk   |   21 March 2020 4:05 PM GMT
ఆ సీఎం మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రకటిస్తారా?
X
కరోనా పుణ్యమా అని సామాజిక చిత్రం పూర్తిగా ధ్వంసమైంది. కూలి వాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకూ అందరూ ప్రభావితమైనోళ్లే. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి.. సంపన్నులకు కరోనా కారణంగా ఇప్పటికిప్పుడు వాటిల్లే నష్టమంటూ ఏమీ ఉండదు. కానీ.. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తూ కడుపు నింపుకునే సామాన్యుల సంగతేమిటి? అన్నది ప్రశ్న. ఇలాంటివారికి కరోనా వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు.

ఈ విషయాన్ని గుర్తించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పేదలు.. రోజువారీ కూలీ పనుల మీద బతికే వారికి సాయాన్ని ప్రకటించారు. తమ రాష్ట్రంలో రోజువారీ కూలీలుగా ఉండే దాదాపు 35 లక్షల మంది కూలీలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కరోనా విస్తరిస్తున్న వేళ.. దాన్ని అధిమించేందుకు వీలుగా.. ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చేసేందుకు యూపీ సీఎం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. యోగి నిర్ణయంతో 15 లక్షల మంది రోజువారీ కూలీలు.. 20.3లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు లాభం చేకూరనుంది. నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే సమకూర్చినందున వారు ఇల్లు దాటి బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో.. కరోనా వ్యాప్తికి చెక్ చెప్పే వీలుందని అంటున్నారు.

మరి.. ఇదే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కూడా అమలు చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ సంపాదన మీద బతికేటోళ్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇలాంటి వారు ఇళ్లకే పరిమితం కావాలంటే ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.