Begin typing your search above and press return to search.
ఉద్యోగులు ఓకేనా....రాజకీయ ధీమానా ?
By: Tupaki Desk | 6 Feb 2022 2:35 PM GMTప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభావిత వర్గం. వారిని మంచి చేసుకోకపోతే ఎంతటి పాలకులకు అయినా చుక్కలు కనిపిస్తాయి. అప్పట్లో దూకుడు తప్ప రాజకీయం తెలియని ఎన్టీయార్ ఉద్యోగులతో పెట్టుకుని చాలా దూరం వెళ్లారు. అయినా చివరికి ఉద్యోగులే తమ డిమాండ్లు నెగ్గించుకున్నారు. జగన్ కూడా ఎన్టీయార్ లాంటి వారే, ఆయన కూడా తెగే దాకా లాగుతారు అనుకున్నారు. కానీ జగన్ రాజకీయ పరిణతి ఏంటో ఫస్ట్ టైమ్ బయటపడింది.
నిజానికి ఏపీ రాజకీయ చరిత్రలో ఉద్యోగులకు నచ్చిన ముఖ్యమంత్రుల పేర్లు చెప్పమంటే జలగం వెంగళరావు, చెన్నారెడ్డితో పాటు డాక్టర్ వైఎస్సార్ పేర్లను మాత్రమే చెబుతారని ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుత ఏలిక జగన్ మారారా లేక ఆయన లాస్ట్ పంచ్ నాదే అని చెప్పుకుంటారా అంటే రెండూ అని చెప్పాలి. జగన్ గత వైఖరికి ఇప్పటికీ ఎంతో కొంత మార్పు అయితే ఉంది. అదే టైమ్ లో అతి ధీమా కూడా ఉంది. అందుకే ఉద్యోగులు ఎక్కడికీ పోరు, వారు మా వాళ్లే అని ఇన్నాళ్ళూ కొంత ఆలోచించారు. కానీ చలో విజయవాడ తరువాత వైసీపీ పెద్దలు మేలుకొన్నారు అనే చెప్పాలి.
మొత్తానికి అతి పెద్ద ఆందోళనకు చాకచక్యంగా శుభం కార్డు వేయించగలిగారు. ఈ ఎపిసోడ్ లో ఉద్యోగులు గెలిచారా, ప్రభుత్వం గెలిచిందా అంటే ఇద్దరూ గెలిచారు అనే చెప్పాలి. వాళ్ళు కొంత తగ్గారు, ప్రభుత్వం కొంత తగ్గింది. మొత్తానికి విపక్షానికి ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా ఇంత పెద్ద నిరసనకు ఎండ్ కార్డు వేయగలిగారని చెబుతున్నారు. మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలు అయితే జగన్ కి ధన్యవాదాలు చెప్పారు.
అయితే ఇక్కడే ఒక విషయం మీద రాజకీయ చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో ఎటు వైపు ఉంటారు అని. వారు 2019 ఎన్నికలలో వైసీపీకి అండగా నిలబడ్డారు. ఈ మధ్యలో పీయార్సీ మీద వివాదం వచ్చింది. అయినా సరే దానికి కూడా సామరస్యంగా ప్రభుత్వం పరిష్కరించుకుంది. ఇక్కడే విపక్షాలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా నెరవేర్చకుండా చేసింది అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఇక టీడీపీ అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కంప్లీట్ సైలెన్స్ అయింది. దానికి కారణం ఉద్యోగ వర్గాలు యాంటీ టీడీపీ స్టాండ్ తోనే ఉంటాయన్న ఉద్దేశ్యంతోనే. ఒకవేళ వారు నిజంగా వైసీపీని వ్యతిరేకిస్తే 2024లో తమ వైపే ఎటూ వస్తారు. అలా కాకుండా ఉంటే తమకు ఆయాసం తప్ప మరేమీ మిగలదు, అందుకే వ్యూహాత్మకంగా ఇండైరెక్ట్ మద్దతుకే టీడీపీ పరిమితం అయింది అంటున్నారు.
చంద్రబాబు ఉద్యోగులకు ఎంత చేసినా కూడా ఆయన 1995 నుంచి 2004 టైమ్ లో నిద్రపోనీ నిద్రపోనీయను అన్న స్లోగన్ తో ఉద్యోగ వర్గాల మీద గట్టిగా వ్యవహరించారు అన్న ముద్ర ఉంది. ఇక ఆయన విభజన ఏపీకి ముఖ్యమంత్రిగా వచ్చి ఎన్నో వరాలు ఇచ్చినా కూడా ఉద్యోగులు మాత్రం ఆయన్ని నమ్మలేదని 2019 ఫలితాలు నిరూపించాయి. బాబు వస్తే తమ పట్ల గట్టిగా ఉంటారన్న భయమేదో వారికి ఉందనే అంటారు. మొత్తానికి ఉద్యోగులు ఎటు వైపు అన్న దాని మీద ఇప్పటికైతే తమ వైపే అని వైసీపీ ధీమాగా ఉంది.
జగన్ సైతం భవిష్యత్తులోఉద్యోగులకు మరింత మేలు చేస్తామని చెప్పారు. బహుశా 2023లో కొత్త పీయార్సీ టైమ్ రావచ్చు. అంటే 12వ పీయార్సీ అన్న మాట. అందులో బోలెడు హామీలు గుప్పించి జగన్ ఎన్నికలకు వెళ్లవచ్చు. అలా ఉద్యోగుల మద్దతు సంపాదించి తిరిగి గెలిచిన తరువాత అమలు చేస్తామని చెప్పవచ్చు. చూడాలి మరి అతి పెద్ద ప్రభావిత వర్గం తరువాత అడుగులు ఎలా ఉంటాయో.