Begin typing your search above and press return to search.
టీడీపీ తో చేతులు కలిపే ప్రతిపక్షాలున్నాయా ?
By: Tupaki Desk | 29 May 2021 12:30 PM GMTవిపక్షాలతో కలిసి అధికార వైసీపీ పై పోరాటం చేయాలని మహానాడులో తెలుగుదేశంపార్టీ తీర్మానం చేసింది. తీర్మానం వరకు బాగానే ఉంది తీర్మానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే భవిష్యత్తును వదిలేస్తే ఇప్పటికిప్పుడు టీడీపీతో చేతులు కలిపేందుకు సీపీఐ తప్ప మరో పార్టీనే సిద్ధంగా లేదన్నది వాస్తవం. సీపీఐ అన్నది చాలాకాలంగా చంద్రబాబునాయుడుతో కలిసే నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే.
గడచిన రెండేళ్ళను ప్రామాణికంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చంద్రబాబు పిలుపిచ్చినా సీపీఐ మాత్రమే చేతులు కలిపింది. వామపక్షాల్లో మరో కీలకమైన సీపీఎం ఇప్పటివరకు టీడీపీతో కలవలేదు. అలాగే చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఉండనే ఉంది. కాబట్టి ప్రతిపక్షమే అయినా టీడీపీతో బీజేపీ కలిసే అవకాశంలేదు. ఇక బీజేపీతో మిత్రపక్షం కాబట్టి జనసేన కూడా ఇప్పటివరకు టీడీపీతో కలవలేదు.
చివరగా కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకు దూరమైపోయింది. కాంగ్రెస్సే టీడీపీని దూరంపెట్టిందా లేకపోతే చంద్రబాబే కాంగ్రెస్ కు దూరం జరిగారా అన్నది బ్రహ్మపదార్ధంగా తయారైంది. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగితే టీడీపీ పార్టిసిపేట్ చేయలేదు. మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విడిగా నిరాహారదీక్ష చేసిందే కానీ కాంగ్రెస్, వామపక్షాలతో కలవలేదు.
ఏ సమావేశమైనా వామపక్షాలుంటే బీజేపీ ఉండదు. అలాగే బీజేపీ పాల్గొనే పోరాటాల్లో వామపక్షాలు ఉండవు. అందరినీ కలుపుకునే వెళ్ళేంత సీన్ ప్రస్తుతానికి చంద్రబాబుకు లేదు. కాబట్టి మహానాడులో చేసిన తీర్మానం తీర్మానంగా మిగిలిపోవటానికే అవకాశం ఎక్కువుంది. బీజేపీతో విడిపోతే కానీ చంద్రబాబుతో కలవటానికి జనసేనకు అవకాశంలేదు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో వైసీపీని బలంగా ఢీకొనేంత శక్తి ప్రతిపక్షాల్లో ఏపార్టీకి లేదన్నది వాస్తవం. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కానీ లేదా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కానీ వచ్చిన ఓట్లనే బెంచ్ మార్కుగా తీసుకుంటే ప్రతిపక్షాల సత్తా ఏమిటో అర్ధమైపోతోంది. కాకపోతే విడివిడిగా తీసుకుంటే ప్రతిపక్షాల్లో టీడీపీనే కాస్త బెటరంతే.