Begin typing your search above and press return to search.
లిస్ట్ లో ఇంకా చాలా మంది హీరోయిన్లు ఉన్నారా?
By: Tupaki Desk | 16 Sep 2022 11:30 AM GMT200 కోట్ల రూపాయల దోపిడీ కేసు విచారణను ఎదుర్కొంటున్న ఆర్థిక నేరగాడు, మల్టీ మిలియనీర్ సుకేష్ చంద్రశేఖర్ విషయంలో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. తీహార్ జైలులో ఉన్న ఇతగాడిని నలుగురు మోడల్స్/నటీమణులు కలిశారని, వారికి డబ్బు, ఖరీదైన బహుమతులు అందజేసినట్లు విచారణలో తేలింది.
అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... "బిగ్ బాస్" ఫేమ్ నిక్కీ తంబోలి, "బడే అచ్ఛే లాగ్తే హై" ఫేమ్ చాహత్ ఖన్నా, సోఫియా సింగ్ మరియు అరుషా పాటిల్ లు చంద్రశేఖర్‌ను జైలు ప్రాంగణంలో కలుసుకున్నారు. అతను తనను తాను దక్షిణాది చిత్ర పరిశ్రమకు నిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ సహాయకురాలు పింకీ ఇరానీ వారితో సమావేశాలు నిర్వహించి డబ్బులు అందజేసినట్టు సమాచారం అందుతోంది.
ఈ నలుగురు నటీమణులకు గూచీ, వెర్సేస్ మరియు లూయిస్ విట్టన్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల ఖరీదైన బహుమతులు అందించారని తెలిసింది..
పాటిల్‌ను జైలులో కలిశానని ఒప్పుకున్న చంద్రశేఖర్ అతని ఖాతాలోకి 5.20 లక్షల రూపాయలను కూడా బదిలీ చేశాడని విచారణలో తేలింది..
ఇరానీ ఖన్నాను చంద్రశేఖర్ కలిసిన తర్వాత ఆ నటికి రూ. 2 లక్షలతోపాటు నీలిరంగు వెర్సాస్ వాచ్ ను కానుకగా ఇచ్చారని ఆరోపించారు.
చంద్రశేఖర్ ఇక హీరోయిన్ సోఫియా సింగ్ ఖాతాలో రూ.2 లక్షలు జమ చేసి, ఎల్వీ బ్యాగ్ ను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు రూ. 1.5 లక్షలు పంపాడు.
చంద్రశేఖర్‌ని తంబోలీకి పరిచయం చేసినందుకు ఇరానీ రూ. 10 లక్షలు పొందినట్టు తెలిసింది. తర్వాత ఆమె తంబోలీకి రూ. 1.5 లక్షలు ఇచ్చింది. చంద్రశేఖర్ ఆమెకు ఒక గుచ్చి బ్యాగ్.. వారి మొదటి కలయికలో రూ. 2 లక్షలు ఇచ్చాడని తెలిసింది.
ఈ నలుగురు హీరోయిన్లకు సుఖేష్ చంద్రశేఖర్ ఎందుకు డబ్బులు ఇచ్చాడు? అసలు కథేంటి? అన్న దానిపై ఇప్పుడు అధికారులు ఆరాతీస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.