Begin typing your search above and press return to search.
ఇంద్రానూయి లైఫ్ లోనూ ఇలాంటివి ఉన్నాయా?
By: Tupaki Desk | 13 April 2022 4:17 AM GMTఅత్యున్నత స్థానాల్లోకి చేరిన వారిని గొప్పగా చూస్తాం. వారెంత లక్కీనో అనుకుంటాం. కానీ.. వారి జీవితాల్లోనూ ఎన్నోకష్టాలు.. కన్నీళ్లు.. బాధలు. . వేదనలు ఉంటాయన్నవిషయాన్నిచాలామంది పట్టించుకోరు. తరచి చూస్తే ఇలాంటి ఉదంతాలు పైకొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. కార్పొరేట్ ప్రపంచంలో దిగ్గజ సీఈవో స్థాయిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన భారత సంతతికి చెందిన మహిళగా ఇంద్రానూయి సుపరిచితురాలు. అలాంటి ఆమె తన ఉద్యోగ జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యల్ని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పెప్సీకో లాంటి అంతర్జాతీయ సంస్థలో వివిధ హోదాల్లో పని చేసి.. చివరకు అత్యున్నత సీఈవో స్థాయిలో పని చేసిన ఆమె 2018లో రిటైర్ అయ్యారు. సంస్థను లాభాల బాట పట్టించిన ఆమె.. తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్నప్పుడు ఇంద్రానూయి జీవితంలో కూడా ఇలాంటివి ఎదురయ్యాయా? అన్న సందేహం కలుగక మానదు.తాజాగా ఆమె పెయిడ్ లీవ్స్ మీద గళం విప్పిన కారణంగా.. కార్పొరేట్ ప్రపంచంలో పెయిడ్ లీవ్స్ పై చేసిన ప్రకటన ఉద్యోగులకు అంతో ఇంతో మంచి జరుగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆమె ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
- నా కెరీర్ మొదలైన తొలి రోజుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో పని చేశా. అప్పుడు మా నాన్నకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు చెప్పారు. నేను మా నాన్నను చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో పెయిడ్ లీవ్స్ అడిగితే ముందు కుదరదని చెప్పారు.
- దీంతో నా జీవితం ఒక్కసారిగా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో పడింది. ఓ వైపు తండ్రి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు. మరోవైపు ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఎలాగోలా మా నాన్నను చూసేందుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చేశా.
- ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న చనిపోయారు. అప్పుడు కంపెనీ నాకు ఆర్నెల్లు పెయిడ్ లీవ్ మంజూరు చేసింది. నాన్న అంత్యక్రియలు.. ఆ తర్వాతి కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే.. 3 నెలల 2 రోజుల తర్వాత నేను తిరిగి విధుల్లో చేరాను.
- అప్పుడు నాకు అవసరం లేకపోవటంతో దాదాపు 3 నెలల పాటు పెయిడ్ లీవ్స్ వదులుకున్నా. పెయిడ్ లీవ్స్ కు నో చెప్పటం.. ఆ తర్వాత ఓకే చెప్పటం.. ఉద్యోగం మీద ఉన్న కమిట్ మెంట్ లో భాగంగా మధ్యలోనే మళ్లీ జాబ్ లోకి చేరటం పెద్ద విషయాలు కావు. కానీ.. పెయిడ్ లీవ్స్ అన్నవి ఉంటాయని తెలియని వాళ్లు.. పెయిడ్ లీవ్స్ లేక అనేక కష్టాల మధ్య ఉద్యోగాల్ని వదిలేసే వారి గురించి తలుచుకుంటనే బాధగా ఉంది.