Begin typing your search above and press return to search.

తెలంగాణలో రెండు రకాల కరోనా వైరస్ లు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   14 April 2020 3:50 AM GMT
తెలంగాణలో రెండు రకాల కరోనా వైరస్ లు ఉన్నాయా?
X
కొత్త వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. శాస్త్రీయ ఆధారం లేకున్నా.. వరుస పెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ వాదన అధికార వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తెలంగాణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో అలాంటిదేమీ కనిపించని తీరుతో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసుల నమోదు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. సోమవారం ఒక్క రోజే 61 కొత్త కేసులు నమోదు కావటం తో ఉలిక్కి పడే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు సంబంధించి ఆసక్తికర వాదన ఒకటి వెలుగు చూస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా తెలంగాణలో తొలి కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ఉదంతానికి ముందు వరకూ తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసులన్ని విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగానే. అలా నమోదైన పాజిటివ్ కేసుల్లో వైరస్ తీవ్రత తక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. విదేశాల నుంచి వచ్చిన వారిలో బయటపడ్డ పాజిటివ్ కేసుల కారణంగా ఇతరులకు వైరస్ వ్యాప్తి పరిమితంగా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

అందుకు భిన్నంగా మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో వైరస్ బలంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. మర్కజ్ లింకు ఉన్న కేసుల్ని పరిశీలిస్తే.. వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కానీ.. కొత్త వారికి సోకిన వైనాన్ని కొట్టిపారేయలేం. విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తించిన పాజిటివ్ కేసుల్లో అత్యధికం యూరప్ దేశాల వారే. మర్కజ్ లింకుతో నమోదైన కేసుల్లో ఎక్కువగా ఇండోనేషియా తో పాటు ఫిలిప్పీన్స్ తో పాటు ఇరాన్ తదితర దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారంటున్నారు. యూరప్ దేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ వ్యాప్తి పరిమితంగా ఉంటే.. అందుకు భిన్నంగా మార్కజ్ వెళ్లి వచ్చి పాజిటివ్ గా తేలిన వారి కారణంగా వెలుగు చూస్తున్న కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే.. ఈ వాదన లో నిజం ఎంత? అన్న విషయం పై అధికారులు ఒక కన్నేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.