Begin typing your search above and press return to search.

ఈ 'మార్పు'.. గెలిపిస్తుందా.. నేత‌లూ..!

By:  Tupaki Desk   |   30 Dec 2022 11:30 PM GMT
ఈ మార్పు.. గెలిపిస్తుందా.. నేత‌లూ..!
X
`మార్పు` మంచిదే. అది నిజ‌జీవితంలో అయినా.. వ్య‌క్తిగ‌త అంశ‌మైనా.. మార్పు తో అనేక మార్పులు వ‌స్తాయి. ఇక‌, రాజ‌కీయాల్లోనూ నాయ‌కులు మార్పును కోరుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు మార్పుల కోసం.. త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఈ మార్పు చుట్టూనే తిరుగుతున్నాయి.

అయితే.. ఈ మార్పు నిజంగానే వారిని మారుస్తుందా? వారి త‌ల‌రాత‌లో మార్పు తెస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వైసీపీని తీసుకుంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారిలో 10 మంది వ‌ర‌కు త‌మ నియోజక వ‌ర్గాలు మార్చ‌మ‌ని కోరుతున్నారు. వీరిలో కొంద‌రు సీనియ‌ర్లు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో సెగ పెరిగింద‌ని.. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేరే చోట‌కు మార్చాల‌ని కోరుతున్నారు.

కానీ, వారి విష‌యంలో వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో నూ ..ఇదే చ‌ర్చ సాగుతోంది. బాగా సెగ ఉన్న‌నియోజ‌క‌వ‌ర్గాలు.. వైసీపీ దూకుడు, నాయ‌కుల బ‌లం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌ను వేరే చోట‌కు పంపించాల‌ని కోరుతున్నారు. తీసుకునే నిర్ణ‌యం ఏదైనా.. ఇప్పుడే తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు.

వచ్చే ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్నందున‌.. ఇప్పుడు ప్ర‌క‌టిస్తే..త‌మ ప్ర‌య‌త్నం తాము చేసుకుం టామ‌ని కూడా చెబుతున్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే.. ఇప్పుడే మార్పులు చేయాల‌ని కోరుతున్నారు.

అయితే.. అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌ట్లేదు. దీంతో నేత‌లకు ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. మ‌రోవైపు.. నేత‌లు నియోజ‌వ‌ర్గాల‌ను మార్చినంత మాత్రాన వారి త‌ల‌రాత మారుతుందా? అనేది కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.