Begin typing your search above and press return to search.

ఈ రెండు రాష్ట్రాలే నూరుశాతం మద్దతిస్తున్నాయా ?

By:  Tupaki Desk   |   13 July 2022 5:30 AM GMT
ఈ రెండు రాష్ట్రాలే నూరుశాతం మద్దతిస్తున్నాయా ?
X
రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల కోసం ఇద్దరు అభ్యర్ధులు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ము మరోవైపు నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా వరసబెట్టి రాష్ట్రాలు చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే ద్రౌపది మంగళవారం ఏపీలో పర్యటించారు. ముందు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎంపీలు, ఎంఎల్ఏలతో భేటీ అయ్యారు. తర్వాత ఓ హోటల్లో చంద్రబాబునాయుడు అండ్ కో తో కూడా సమావేశమయ్యారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ద్రౌపదికి ఇటు అధికార వైసీపీ అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు నూరుశాతం మద్దతు ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని 175 మంది ఎంఎల్ఏలు, 25 మంది ఎంపీలు ద్రౌపదికే ఓటు వేయబోతున్నారు. మిగిలిన పార్టీలకు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఏపీలోని ఓట్లలో నూరుశాతం ద్రౌపదికే పడటం ఖాయమనే అనుకోవాలి.

ఈ విషయంలో మంచి క్లారిటి ఉంది కాబట్టే యశ్వంత్ సిన్హా ఓట్ల కోసం అసలు ఏపీ వైపే చూడలేదు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాబట్టి మెజారిటీ ఓట్లు సిన్హాకు పడతాయనటంలో సందేహంలేదు.

ఎంఐఎం కూడా సిన్హాకే మద్దతు ప్రకటించింది. అయితే బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎంఎల్ఏలు ముర్ముకే ఓట్లేస్తారు. సో హోలు మొత్తంమీద తెలంగాణాలోని ఓట్లలో 90 శాతం ఓట్లు సిన్హాకే పడతాయనటంలో సందేహంలేదు.

ఇదే పద్దతిలో చాలా రాష్ట్రాల్లోని ఓట్లలో మెజారిటియే లేకపోతే మైనారిటీయో ఇద్దరు అభ్యర్ధులకు పడతాయి. అయితే నూరు శాతం ఓట్లు ఏపీ, మిజోరంలో మాత్రమే ద్రౌపదికి పడబోతున్నాయి.

ఒక అభ్యర్ధికి అనుకూలంగా నూరు శాతం ఓట్లుపడటం ఇప్పటివరకు ఈ రెండు రాష్ట్రాల్లోనే సాధ్యమవుతోంది. మరి ఎన్నికలకు ఇంకా ఐదురోజులుంది కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో కూడా నూరుశాతం ఓట్లు ఏకపక్షంగా నమోదయ్యేందుకు అవకాశాలున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.