Begin typing your search above and press return to search.
వీళ్లంతా బీజేపీని మోసం చేస్తున్నారా.?
By: Tupaki Desk | 20 Jun 2019 10:08 AM GMT40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన.. ఇలాంటివి ఎన్ని చూసుంటాడు.. ఎన్ని రాజకీయాలు చేసుంటాడు.. అయినా ఇలాంటివి సంక్షోభాలు బాబుగారికి కొత్త కాదని ఇప్పుడు టీడీపీలో కథలు కథలుగా చెబుతున్నారు.. ఈ మధ్యాహ్నం నుంచి టీడీపీలో సంక్షోభం.. ముదిరిన ముసలం.. అంటూ నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో కలిసేందుకు లేఖ ఇవ్వడం.. కాకినాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలనుకోవడం.. ఇలా జరుగుతున్న పరిణామాలను చూసిన టీడీపీ వాదులు నిజానికి హతాషులవ్వాలి.. టీడీపీ పని అయిపోయిందని బాధపడాలి. తెరవెనుక సంగతులు తెలియని వాళ్లు ఇలాగే తెగ బాధపడుతున్నారట.. కానీ ఇందులో ఏదో కిటుకు ఉందని బాబును దగ్గర నుంచి చూసిన వాళ్లు అనుమానిస్తున్నారు..
40 ఏళ్ల రాజకీయం అనుభవంలో బాబు ఎన్ని ఎత్తులైనా వేయగలడు. అంపశయ్యపై ఉన్న తన పార్టీని కాపాడుకోవడం.. టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న వారిని రక్షించడం ఎలాగో చంద్రబాబు కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతుంటారు. అందుకే ఇప్పుడు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్న నలుగురు రాజ్యసభ ఎంపీల విషయంలో ఏదో మతలబు ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగుదేశం రాజ్యసభ నలుగురు ఎంపీలు కరుడుగట్టిన టీడీపీ వాదులు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కీలకమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి బాగానే గిట్టుబాటు అయ్యిందంటారు. ఇక మరో ఇద్దరు ఎంపీలైన గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు కూడా టీడీపీ నమ్మినబంటులే.. వీరు హఠాత్తుగా కన్నతల్లి లాంటి టీడీపీని వదిలి బీజేపీలో చేరడం వెనుక మాస్టర్ ప్లాన్ చంద్రబాబుదేన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోందట..
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని ఓడించడానికి చంద్రబాబు ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టారు.కానీ బీజేపీ అఖండ మెజార్టీతో గెలవడం.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. టీడీపీ టార్గెట్ అయ్యింది.. మోడీషాలు వదిలిపెట్టే రకం కాదు.. అందుకే ఇప్పుడు టీడీపీ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్ లను టార్గెట్ చేసి వారిపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోంది. అందుకే వీరిద్దరినీ బీజేపీ బారి నుంచి కాపాడేందుకే బాబే వారిని ఆ పార్టీలోకి పోమ్మని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. టీజీ వెంకటేశ్, గరికపాటికి కూడా వ్యాపారాలు ఉండడంతో వారిద్దరూ కూడా బీజేపీలో చేరి సేఫ్ జోన్ లో ఉండాలని తెరవెనుక బాబుయే ఈ ప్లాన్ చేసినట్టు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
దీనికి ప్రధాన కారణంగా అటు బీజేపీని ఎదుర్కోవడం.. ఇటు వైసీపీని బీజేపీకి దూరం చేయడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీతో రాసుకుపూసుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు టీడీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరితే వైసీపీని దూరం చేసినవారు అవుతారు. టీడీపీ నేతలున్న బీజేపీతో జగన్ దోస్తీ చేయడం ఇబ్బందే.. ఇక ఏపీలో సొంతంగా ఎదిగేందుకు వలసవచ్చిన టీడీపీ నేతలతో వైసీపీని బీజేపీ దూరం పెట్టే అవకాశాలుంటాయి. ఇదేకాక.. ఈ ఐదేళ్లు బీజేపీలో ఉండి తమను తాము కాపాడుకునేందుకు ఈ టీడీపీ నేతలకు అవకాశాలుంటాయి. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను బాబు వేసినట్టు అర్థమవుతోందంటున్నారు. బీజేపీ, వైసీపీలను దూరం చేయడం.. తనను నమ్ముకున్న టీడీపీ నేతలను రక్షించేందుకే టీడీపీ ఎంపీలు, ఇతర నేతలను ఈ ఐదేళ్లు బీజేపీలో అజ్ఞాత వాసానికి బాబు పంపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
వచ్చే 2024 తర్వాత ఫలితాలను బట్టి వీరు మళ్లీ టీడీపీలో చేరుతారని.. కరుడుగట్టిన టీడీపీ వాదులు ఇప్పుడు బాబు సలహా మేరకే బీజేపీలో చేరుతున్నారన్న చర్చ ఆ పార్టీలో.. రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.