Begin typing your search above and press return to search.

రేసులో ఉన్నోళ్ల‌లో జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చేదెవ‌రికి?

By:  Tupaki Desk   |   1 Jun 2019 6:37 AM GMT
రేసులో ఉన్నోళ్ల‌లో జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చేదెవ‌రికి?
X
ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినంత‌నే త‌న మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించ‌టం అంద‌రు ముఖ్య‌మంత్రులు చేసే ప‌ని. అలాంటి తీరుకు చెక్ పెట్టి.. నెల‌కు పైనే టైం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించారు. ఈ నెల 30న ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్.. త‌న కేబినెట్ ను ఈ నెల 8న ప్ర‌క‌టించ‌నున్నారు. అదే రోజున వారి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

జ‌గ‌న్ కేబినెట్ లో ఎవ‌రెవ‌రికి స్థానం ల‌భిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తొలుత అనుకున్న‌ట్లు రెండు ద‌శల్లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని భావించినా.. అందుకు భిన్న‌మైన నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. మొదట్లో అనుకున్న‌ట్లు కాకుండా.. ఒకేసారి మంత్రివ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో నియ‌మించేసుకోవ‌టం ద్వారా పాల‌నా ర‌థాన్ని మ‌రింత వేగంగా న‌డిపే వీలుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి జ‌గ‌న్ కేబినెట్ క‌స‌ర‌త్తు పోలింగ్ ముగిసిన వెంట‌నే పూర్తి అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. విజ‌యం మీద జ‌గ‌న్ కు ఉన్న ధీమాతో త‌న కేబినెట్ లో ఎవ‌రెవ‌రికి చోటు క‌ల్పించాల‌న్న విష‌యంపై ఇప్ప‌టికే క్లారిటీతో ఉన్నారు. కాకుంటే.. ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత మారిన కాంబినేష‌న్ల‌కు త‌గ్గ‌ట్లు కొన్ని మార్పులు చేయాల్సి వ‌స్తోంది. అది మిన‌హా కోర్ కేబినెట్ లో మార్పులు లేవ‌ని స‌మాచారం.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గన్ పార్టీ నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం.. జిల్లాల వారీగా మంత్రివ‌ర్గంలో రేసులో ఉన్న నేత‌ల లెక్క తేలింది. వీరిలోని వారికే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు కేటాయిస్తార‌ని చెబుతున్నారు. తొలుత అనుకున్న దానికి మించిన ఘ‌న విజ‌యం రావ‌టంతో.. మంత్రివ‌ర్గంలో స్థానం కోసం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. అయినా తాను అనుకున్న వారు కాకుండా కొత్త ముఖాలు కొద్ది మాత్ర‌మే కేబినెట్ లోకి తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.
పార్టీ వ‌ర్గాల చ‌ర్చ‌ల్లో భాగంగా.. మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్న నేత‌లు జిల్లాల వారీగా చూస్తే..

+ శ్రీకాకుళం జిల్లా

ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)

ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట)

కళావతి (పాలకొండ)

రెడ్డి శాంతి (పాతపట్నం)

+ విజయనగరం జిల్లా

బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)

కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం)

పుష్పశ్రీవాణి (కురుపాం)

రాజన్నదొర (సాలూరు)

+ విశాఖపట్నం జిల్లా

గుడివాడ అమరనాథ్‌ (అనకాపల్లి)

గొల్ల బాబూరావు (పాయకరావుపేట)

ముత్యాలనాయుడు (మాడుగుల)

+ తూర్పు గోదావరి జిల్లా

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌)

దాడిశెట్టి రాజా(తుని)

+ పశ్చిమగోదావరి జిల్లా

ఆళ్ల నాని (ఏలూరు)

తెల్లం బాలరాజు (పోలవరం)

తానేటి వనిత (కొవ్వూరు)

గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం)

+ కృష్ణా జిల్లా

కొడాలి నాని (గుడివాడ)

పేర్ని నాని (మచిలీపట్నం)

సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)

కొలుసు పార్థసారథి (పెనమలూరు)

మేకా వెంకట ప్రతాప అప్పారావు (నూజివీడు)

+ గుంటూరు జిల్లా

మర్రి రాజశేఖర్‌ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు)

ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి)

అంబటి రాంబాబు (సత్తెనపల్లి)

+ ప్రకాశం జిల్లా

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

ఆదిమూలపు సురేశ్‌ (యర్రగొండపాలెం)

+ చిత్తూరు జిల్లా

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)

భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి)

+ నెల్లూరు జిల్లా

మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు)

రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (కావలి)

ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి)

+ కడప జిల్లా

గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)

అంజాద్‌బాషా (కడప)

+ కర్నూలు జిల్లా

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌)

శ్రీదేవి (పత్తికొండ)

హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు

+ అనంతపురం జిల్లా

అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్‌)

కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)

ఎం.శంకరనారాయణ (పెనుకొండ)